[ad_1]
జనవరి సెలవులు..
2023 జనవరిలో బ్యాంకులు 14 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. అందువల్ల బ్యాంకులకు వెళ్లటానికి ముందు తప్పక సమాచారం తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సంవత్సరానికి ఇచ్చిన బ్యాంకింగ్ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు సెలవులో ఉండే రోజుల వివరాలు దేశంలోని వివిధ బ్యాంకులకు వేరువేరుగా ఉండనున్నాయి.
జనవరిలో వారపు సెలవులు..
కొత్త సంవత్సరం మొదటి సెలవు దినం జనవరి 1, 2023న అంటే ఆదివారం వస్తుంది. ఇది కాకుండా జనవరి 8, 15, 22, 29 కూడా ఆదివారాలు కావటంతో బ్యాంకులు మూతపడే ఉంటాయి. వీటికి తోడు జనవరి 14, 28 రెండవ శనివారాలు కావటంతో బ్యాంకులు సెలవులో ఉంటాయి. దీనికి తోడు జనవరి 26న గణతంత్ర దినోత్సవం కావటంతో అన్ని బ్యాంకులు బంద్ అవుతాయి.
మొబైల్, నెట్ బ్యాంకింగ్..
బ్యాంకులు భౌతికంగా మూతపడి ఉన్నప్పటికీ.. కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మెుబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిథిగా అందుబాటులోనే ఉంటాయి. బ్యాంక్ పనులను చాలా వరకు నిర్వహించుకోవచ్చు. దీనికి తోడు ఏటీఎం సేవలు కూడా సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని పనులు మాత్రం నేరుగా బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.
స్పెషల్, పండుగ సెలవులు..
జనవరి 2 మిజోరంలో నూతన సంవత్సర సెలవు దినం, జనవరి 11 మిజోరంలో మిషనరీ డే, జనవరి 12న పశ్చిమ బెంగాల్‌లో స్వామి వివేకానంద జయంతి, జనవరి 14న గుజరాత్, కర్ణాటక, అస్సాం, సిక్కిం, తెలంగాణలోని మాగ్ బిహు, జనవరి 16న ఆంధ్రప్రదేశ్‌లో కనుమ పండుగ, పాండిచ్చేరి.. తమిళనాడులో ఉజ్వల తిరునాలి, జనవరి 23న అస్సాంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.. హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం, జనవరి 31న అస్సాంలో జాతీయ సెలవు, మీ-దమ్-మీ-ఫీ 25 బ్యాంకులు మూసివేయబడతాయి.
[ad_2]
Source link