Bank Locker: జనవరి 1 నుంచి మారిపోతున్న రూల్స్.. తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త..

[ad_1]

మారిన రూల్స్..

మారిన రూల్స్..

ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం లాకర్ యజమానులందరూ తప్పనిసరిగా కొత్త లాకర్ ఏర్పాటుకు జనవరి 1, 2023 నాటికి అర్హతను ప్రదర్శించాలి. దీనికి తోడు ఇప్పటికే ఉన్న లాకర్ పునరుద్ధరణకు అగ్రిమెంట్ పై సంతకం చేయాలని స్పష్టం చేసింది. 2021, ఆగస్టు 8 ప్రకటించిన సవరణలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం సేఫ్ లాకర్ ఉంచబడిన ప్రాంగణంలో భద్రత, భద్రతను నిర్ధారించాల్సిన పూర్తి బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది.

పరిహారం ఎలాగంటే..

పరిహారం ఎలాగంటే..

లాకర్ కలిగి ఉన్న ఖాతాదారుడి వస్తువుల్లో బ్యాంకు ఉద్యోగులు మోసం చేసినా, అగ్నిప్రమాదం జరిగినా, బ్యాంకు భవనం కూలిపోయినా, సేఫ్ డిపాజిట్ బాక్స్ దెబ్బతిన్నా సదరు బ్యాంక్ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పక్షంలో బ్యాంకులు కస్టమర్‌ చెల్లించిన ఏడాది అద్దెకు 100 రెట్లు పరిహారం చెల్లించాలని గతంలో భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.

అనుమతి లేని వస్తువులు..

అనుమతి లేని వస్తువులు..

బ్యాంకు లాకర్లలో అక్రమ వస్తువులు లేదా ప్రమాదకరమైన పరికరాలను ఉంచకూడదు. దీనికి తోడు బ్యాంకులు శాఖల వారీగా లాకర్ ఖాళీల వివరాలను తమ వెబ్‌సైట్‌లో బహిరంగంగా ప్రచురించాలి. లాకర్ అందుబాటులో లేని కస్టమర్‌కు వెయిటింగ్ పీరియడ్ కోసం రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి.

బ్యాంకులకు బాధ్యత ఉండదు..

బ్యాంకులకు బాధ్యత ఉండదు..

భూకంపాలు, వరదలు, పిడుగులు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల జరిగే నష్టాలకు బ్యాంక్ బాధ్యత వహించదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి తోడు లాకర్ యజమాని నిర్లక్ష్యం కారణంగా వస్తువులకు నష్టం జరిగినట్లయితే ఇలాంటి సందర్భంలో కూడా సదరు బ్యాంకుకు ఎలాంటి బాధ్యత ఉండదని RBI స్పష్టం చేసింది. అలాగే వరుసగా 3 ఏళ్ల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే దానిని ఓపెన్ చేసి ఖాళీ చేసే హక్కు బ్యాంక్ అధికారులకు ఉంటుందని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

బ్యాంక్ మార్పులు..

బ్యాంక్ మార్పులు..

బ్యాంక్ శాఖల విలీనం లేదా బ్యాంక్ శాఖను మరొక ప్రదేశానికి బదిలీ చేయడం, బ్రాంచ్ మూసివేత వంటి వివరాలను ఖచ్చితంగా కస్టమర్లకు తెలియజేయాలి. ఇందుకోసం స్థానిక వార్తాపత్రికతో సహా రెండు న్యూస్ పేపర్లలో దీనికి సంబంధించిన వివరాలను బ్యాంక్ ప్రచురించాల్సి ఉంటుంది. ఈ వివరాలను బ్యాంక్ కనీసం రెండు నెలల ముందుగానే తెలియజేయాలి.

లాకర్ల సేఫ్టీ ఇలా..

లాకర్ల సేఫ్టీ ఇలా..

లాకర్ల రక్షణకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కనీసం 180 రోజుల పాటు ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాలోని CCTV ఫుటేజీని భద్రపరచడం చాలా ముఖ్యం. ఏదైనా బ్యాంక్ తన సొంత కస్టమర్లకు మాత్రమే కాకుండా.. బ్యాంకుతో సంబంధం లేని ఇతర కస్టమర్లకు కూడా లాకర్ సౌకర్యాన్ని అందించవచ్చు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *