స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ..

ఐసీఐసీఐ అంచనాల ప్రకారం లాభపడే ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి వరుసలో ఉంది. అయితే గత శుక్రవారం మార్కెట్ క్రాష్ వల్ స్టాక్ 3.42 శాతం క్షీణించింది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.573.10 వద్ద ఉంది. గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్ షేర్లు 5.29 శాతానికి పైగా క్షీణించాయి. అయితే 6 నెలల కిందట కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి 24.26 శాతం రాబడి వచ్చింది. రానున్న రోజుల్లో స్టాక్ ధర రూ.750 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ నమ్మకంగా ఉంది. అందుకే ఎస్బీఐ షేర్లకు BUY రేటింగ్ ఇచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా పొజిషనల్ షేర్ హోల్డర్లు గత 6 నెలల్లో 69.25 శాతం వరకు రాబడిని అందుకున్నారు. ఈ స్టాక్ గత నెల కూడా మంచి పనితీరును కనబరిచి 0.83 శాతం లాభపడింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు గత 5 ట్రేడింగ్ సెషన్లలో 7.11 శాతం క్షీణించి రూ.169.25 వద్ద ఉన్నాయి. ICICI సెక్యూరిటీస్ అంచనా ప్రకారం రానున్న కాలంలో షేర్ ధర రూ.220 స్థాయికి పెరగవచ్చని తెలుస్తోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుకు కూడా బ్రోకరేజ్ BUY రేటింగ్ ఇచ్చింది.

ఇండియన్ బ్యాంక్..

ఇండియన్ బ్యాంక్..

గత 5 సెషన్లలో ఇండియన్ బ్యాంక్ షేర్ ధర 5.79 శాతం పడిపోయి రూ.278.15 స్థాయికి చేరుకుంది. అయితే గత నెల మాత్రం కంపెనీ షేర్లు దాదాపుగా 2.28 శాతం లాభపడ్డాయి. ఎవరైనా ఇన్వెస్టర్ 6 నెలల కిందట ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపు 80 శాతానికి పైగా రాబడి వచ్చింది. ఇండియన్ బ్యాంక్ షేర్లు రాబోయే నెలల్లో రూ.335 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అందుకే ఈ కంపెనీ షేర్లకు కూడా BUY రేటింగ్ ఇచ్చింది.

Note: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడుల విషయంలో విచక్షణతో మెలగటం ముఖ్యం. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా దానికి ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం. పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దాని ఆధారంగా ఎలాంటి ఇన్వెస్ట్ మెంట్స్ చేయకండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *