Best diets for weight loss: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. అందరూ అందంగా, నాజుగ్గా కనిపించాలనుకుంటారు. కానీ, దానికి అధిక బరువు దీనికి అడ్డొస్తూ ఉంటుంది. బరువు ఎక్కువగా ఉంటే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. బరువు ఈజీ పెరిగిపోతాం కానీ, బరువు తగ్గడమే చాలా కష్టమైన పని. ఈ బిజీబిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా.. చాలామందికి ఎక్సర్‌సైజ్‌ చేసే సమయం దొరకట్లేదు. దీని కారణంగా, వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే చాలా మంది.. డైటింగ్‌పై ఆధారపడుతున్నారు. బరువు తగ్గడానికి.. రకరకాల డైట్‌లు చాలానే ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంచుకోవాలి, ఏది పాటిస్తే.. ఆరోగ్యకరంగా బరువు తగ్గుతాం అనే సందేహాలు చాలా మందికే ఉంటాయి. మీ వెయిట్‌ లాస్‌కు సహాయపడే.. ఐదు ఆరోగ్యకరమైన డైట్‌లను నిపుణులు సిఫార్సు చేశారు. వీటిని పాటిస్తే.. మీ ఆరోగ్యంగా, సంతోషంగా బరువు తగ్గొచ్చు.

మెడిటేరియన్‌ డైట్‌..

మెడిటేరియన్‌ డైట్‌ అనే అనేది మొక్కల ఆధారిత ఆహారం. ఇది మధ్యధరా సముద్రం సమీపంలో నివసించే ప్రజల ఆహారపు అలవాట్ల నుంచి వచ్చింది. ఇందులో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఆహారాలు ఉంటాయి. పచ్చి ఆలివ్ నూనెను ఇందులో ఉపయోగిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు. మెడిటరేనియన్ డైట్‌లో మొక్కల ఆధారిత ఆహారాలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ వంటి హెల్తీ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, పండ్లు ఉంటాయి. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. ఈ డైట్‌ పాటిస్తే.. గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ డైట్‌లో రోజుకు 1500 క్యాలరీలు మించి తీసుకోకూడదు.

మెడిటేరియన్‌ డైట్‌లో ఈ ఆహారం ఉంటుంది..

మెడిటేరియన్‌ డైట్‌లో ఈ ఆహారం ఉంటుంది..

మోడిటేరియన్‌ డైట్‌లో బ్రోకలీ, కాలే, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యారెట్లు, బ్రస్సెల్స్ స్రౌట్స్‌, కీరా, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, టమాటాలు వంటి కూరగాయలు తీసుకుంటారు. అరటి, ఆపిల్, నారింజ, బేరి, స్ట్రాబెర్రీ , ద్రాక్ష వంటి పండ్లు తింటారు. బీన్స్, కాయధాన్యాలు, పప్పులు, చిక్‌పీస్ , శనగలు చిక్కులు తింటారు. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ, మొక్కజొన్నలు తీసుకుంటారు. సీ ఫుడ్‌లో సాల్మన్, సార్డినెస్, ట్యూనా, మాకేరెల్, గుల్లలు , పీతలు తింటారు.

డాష్‌ డైట్‌ (DASH) ..

-dash-

డాష్‌ డైట్‌ బీపీని నియంత్రించే ఆహార విధానంగా నిరూపితమైంది. దీని ప్రకారం రోజులో ఒక వ్యక్తికి చెంచా(5 గ్రా.) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. దీనిలో ఉప్పు తగ్గించడమే కాదు.. మినరల్స్‌, విటమిన్స్‌ వంటి పోషకాలు ఉన్నా ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ డైట్‌లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ, ఫోలిక్‌ యాసిడ్స్‌ రక్తాన్ని పలుచగా చేసి హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుతాయి. DASH డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నాన్‌ ప్యాటీ డైరీ వంటి ఆహారం పదార్థాలు ఉంటాయి. దీనిలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను పరిమితం చేస్తుంది. DASH డైట్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, బరువు తగ్గిస్తుంది.

వీగన్‌ డైట్‌..

వీగన్‌ డైట్‌..

వీగన్‌ డైట్‌లో జంతు మాంసంతో పాటు జంతువుల నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటారు. దీంతో పూర్తిగా శాకాహారం తీసుకోవాల్సి వస్తుంది. వీగన్ డైట్స్ సాధారణంగా తక్కువ క్యాలరీలతో నిండి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, ముడిధాన్యాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో తక్కువ క్యాలరీలకే కడుపు నిండిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడం సులభమవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వీగన్ డైట్ మన శరీరానికి అవసరమయ్యే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లనే కాదు.. పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలను మన శరీరానికి అందిస్తుంది.

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయంలో ఏమీ తినకూడదు. మీ వీలును బట్టి ఈ 16 గంటలు మీరే నిర్ణయించుకోవాలి. ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌‌లో.. ఏం తినాలనే రూల్స్‌ లేవు. ఎప్పుడు తినాలనేదే ముఖ్యం. తీసుకునేది పౌష్టికాహారం అయితే మంచిదని నిపుణులు అంటున్నారు. ఫాస్టింగ్‌ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ ప్రధాన ఉద్దేశం చక్కెర స్థాయిలను తగ్గించి, కొవ్వును ఖర్చు చేయడమే.

పెస్కాటేరియన్ డైట్‌

పెస్కాటేరియన్ డైట్‌

పెస్కాటేరియన్ డైట్‌.. ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారం. దీనిలో చేపలు, ఇతర సముద్ర ఆహారాలు ఉంటాయి. దీనిలో ప్రాసెస్‌ చేసిన, ఫ్రైడ్‌ ఫుడ్‌ తీసుకోరు. (Image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *