Best vitamins for hair growth: జుట్టు రాలడం చాలామందిని వేధిస్తున్న సమస్య. జుట్టు రాలడానికి.. కాలుష్యం, ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, హార్మన్ల అసమతుల్యత, పోషకాహారం లోపం వంటి కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలడం, చిట్టిపోవడం, పోడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి 13 రకాల పోషకాలు అవసరం. వాటిలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు.. B గ్రూప్‌ విటమిన్లు చాలా ముఖ్యమైనవి. ఈ B గ్రూప్‌ విటమిన్లు.. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యానికి తోడ్పడతాయి. B విటమిన్ ప్రోటీన్ల శోషణను పెంచి, జుట్టు కణాలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. బయోటిన్ (B7), ఫోలేట్ (B9), విటమిన్ B12 సాధారణంగా జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలుగా పిలుస్తారు.

తృణధాన్యాలు..

తృణధాన్యాలు శరీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో జుట్టు ఆరోగ్యానికి కూడా అంతే అవసరం. గోధుమ. బార్లీ, జొన్నలు, ఓట్స్, మిల్లెట్ వంటి తృణధాన్యాలలో విటమిన్ B1, B2, B3, B5 మెండుగా ఉంటాయి. మీ డైట్‌లో తృణధాన్యలు ఎక్కువగా తీసుకుంటే.. జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

అవకాడో..

అవకాడోలో రిబోఫ్లేవిన్, విటమిన్ బి12, నియాసిన్, విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పొడవుగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అవోకాడోను సలాడ్లలో వేసుకోవచ్చు. స్మూతీగా తీసుకోవచ్చు. దీన్ని ఎక్స్‌టర్‌నల్‌ హెయిర్‌ కేర్‌ కోసం కూడా ఉపయోగించవచ్చు.

నట్స్‌..

నట్స్‌లో విటమిన్ బి1 థయామిన్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ కార్యాచరణను ప్రేరేపిస్తుంది. ఆహారం నుంచి పోషకాలను శక్తిగా మారుస్తుంది. ఇది జుట్టు కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మీ డైట్‌లో బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, పిస్తాలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలను తీసుకుంటే జుట్టు హెల్తీగా పెరుగుతుంది.

చేపలు..

చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ B12 ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. వారానికి రెండు సార్లు చేపలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

గుడ్లు..

జుట్టు హెల్తీగా ఉండాలంటే.. రోజుకొక గుడ్డు తింటే మంచిది. ఇందులో విటమిన్ బి5 పుష్కలంగా ఉంటుంది. జుట్టు కణాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. గుడ్డులో ఉండే విటమిన్ బి12 శరీరం ఎర్రరక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. గుడ్లును ఉడకబెట్టైనా, ఆమ్లెట్‌ వేసుకుని అయినా తీసుకోవచ్చు.

ఆకు కూరలు..

పాలకూర, కొత్తిమీర, మెంతి కూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్‌ చేయండానికి ఈ పోషకం సహాయపడుతుంది. రోజుకు ఒక కప్పు ఆకుకూరలు మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

పాల ఉత్పత్తులు..

పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటాయి. పాలు, పెరుగు, చీజ్‌ వంటి డైరీ ఉత్పత్తులలో.. బయోటిన్ (B7) సమృద్ధిగా లభిస్తుందు. బయోటిన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. మీ డైట్‌లో డైరీ ప్రొడక్ట్స్‌ను తరచుగా తీసుకుంటే.. జుట్టు ఆరోగ్యాంగా పెరుగుతుంది. హెయిర్‌ ఫాల్‌ సమస్య దూరం అవుతుంది.

ఫోలేట్ (B9)..

-b9-

ఈ విటమిన్ లోపం కారణంగా జుట్టు తెల్లబడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడితే శరీరంలో విటమిన్ బి9 లోపం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

విటమిన్‌ B7..

-b7-

బయోటిన్ (B7) ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌ను విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది. బయోటిన్‌ లోపం కారణంగా జుట్టు రాలే సమస్య అధికమవుతుంది.

విటమిన్ B గ్రూప్ నీటిలో కరిగే. వీటిని మన శరీరం స్టోర్‌ చేసుకోలేదు. మన డైట్‌లో విటమిన్‌ బి రిచ్‌ ఆహారపదార్థాలు తీసుకుంటే.. జుట్టు హెల్తీగా ఉంటాయి.

విటమిన్‌ B12..

-b12-

విటమిన్ B12 ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు ఎర్ర రక్తకణాలును తీసుకువెళ్తుంది. ఈ ఎర్ర రక్త కణాలు హెయిర్ ఫోలికల్స్‌కు చేరితే.. కొత్త వెంట్రుకలు ఏర్పడతాయి. పాత జుట్టుకు కూడా పోషణ లభిస్తుంది. మన శరీరంలో విటమిన్‌ B12 ఎక్కువ అయితే.. జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ నర్సింగ్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. విటమిన్ B12 లోపం ఉన్న 1000 మంది భాదితుల్లో 30 శాతం మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *