రికార్డుల ప్రకారం..
భారత్ పే మాజీ సీఈవో సుహైల్ సమీర్ 2022 ఆర్ఖిక సంవత్సరంలో రూ.2.1 కోట్ల వేతనాన్ని పొందారు. ఈ నెల ప్రారంభంలో సమీర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే క్రమంలో కంపెనీ వ్యవస్థాపకుడు, బోర్డు సభ్యుడు శాశ్వత్ నక్రానీ రూ.29.8 లక్షలు, బోర్డు సభ్యుడు కేవల్ హండా రూ.36 లక్షలు వేతనంగా అందుకున్నారు. కంపెనీ ప్రకారం వ్యక్తులకు షేర్-ఆధారిత చెల్లింపులు ఈ పరిహారంలో భాగం కాదు.

పెరిగిన ఖర్చులు..
2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ షేర్ ఆధారిత చెల్లింపు ఖర్చులు 218 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరుకున్నాయి. FY22లో BharatPe ఎగ్జిక్యూటివ్ బృందానికి ఇచ్చిన రూ.315 కోట్ల ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌ల (ESOPలు) పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ మేనేజ్‌మెంట్ బృందంలోని రజనీష్ కుమార్, శాశ్వత్ నక్రానీ, సుహైల్ సమీర్, సుమీత్ సింగ్ మెజారిటీ ESOPలను అందుకున్నట్లు గ్రోవర్ ఇన్వెస్టర్లు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కంపెనీ ఆదాయం..
ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ 2022 ఆర్థిక సంవత్సరానికి 284 శాతం పెరిగి రూ.457 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో కంపెనీ నికర నష్టాలు 3.5 రెట్లు పెరిగి రూ.5,610 కోట్లకు చేరుకుంది. కంపెనీ జాతాలు, వేతనాల ఖర్చు సైతం 116 శాతం పెరిగి రూ.110 కోట్లకు చేరుకున్నాయి. అడ్వర్టైజింగ్ ఖర్చులు 535 శాతం పెరిగి రూ.246 కోట్లకు చేరాయి.