BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS

[ad_1]

News

oi-Bogadi Adinarayana

|

స్మార్ట్ ఫోన్ అనగానే టక్కున గుర్తొచ్చేవి రెండే. వాటిలో ఒకటి అండ్రాయిడ్ OS కాగా మరోటి IOS ఆధారిత యాపిల్ ఫోన్. వీటిని తలదన్నుతూ BharOS అనే కొత్త తరహా OSను ప్రపంచానికి భారత్ పరిచయం చేసింది. అండ్రాయిడ్, IOSతో పోలిస్తే మరింత సురక్షితంగా ఈ కొత్త OSను తీర్చిదిద్దినట్లు తయాదీదారులు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలు, కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే వెసులుబాటు సైతం దీనితో లభిస్తోందని హామీ ఇస్తున్నారు.

ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా…

ఆండ్రాయిడ్ OSకు సంబంధించి టెక్ దిగ్గజం గూగుల్ ఆధిపత్య దుర్వినియోగంపై సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు దేశ చట్టాలకు అనుగుణంగా లేవన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ తరుణంలో.. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన దేశీయ OS వైపు అందరి చూపూ ఉంది.

IIT మద్రాసుతో కలిసి జాండ్‌కాప్స్ అనే సంస్థ ఈ ఆపరేటింగ్ సిస్టంను అభివృద్ధి చేసింది. ఆత్మ నిర్భర భారత్‌ లో భాగంగా మన దేశపు ముందడుగు BharOS అని మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS

అనవసర యాప్‌ ల ఊసే ఉండదు:

BharOS ఎటువంటి ముందస్తు యాప్‌లు ఉండవు. వినియోగదారుల అభిరుచి మేరకు ప్రైవేట్ యాప్ స్టోర్ ల నుంచి కావాల్సిన వాటిని ఇన్‌ స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుందని IIT మద్రాసు డెరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. ఈ కొత్త OS.. స్వదేశీ పరిఙానంతో కూడిన ఫోన్ల వాడకానికి స్వావలంబన దిశగా ఓ ముందడు అన్నారు. లబ్ధిదారుల గోప్యత విషయంలో ఎటువంటి అనుమానాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

English summary

BharOS to take over android and ios

BharOS take over android and IOS..

Story first published: Wednesday, January 25, 2023, 21:30 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *