News

oi-Chekkilla Srinivas

|

బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు 3.5 శాతం నుంచి 6.755 వరకు ఇస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ ప్లాన్‌తో, బ్యాంక్ ప్రత్యేక 399 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 7.05 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.55 శాతం వడ్డీని చెల్లిస్తోంది. సవరించిన రేట్లు మార్చి 17, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.

7 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ డిపాజిట్లపై, బ్యాంక్ ఇప్పుడు 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 180 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఇప్పుడు 4.5 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు 181 రోజుల నుంచి 210 రోజుల వరకు డిపాజిట్లపై 5.25% వడ్డీ రేటును చెల్లిస్తోంది. 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్ అవధిపై 5.75% వడ్డీ రేటును ఇస్తోంది. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 6.75% వడ్డీ రేటును ఇవ్వనున్నారు. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యేవి 6.50% వడ్డీ రేటును చెల్లించనున్నారు.

BOB: ఎఫ్‍డీలపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా..

బరోడా తిరంగా డిపాజిట్ పథకం కింద 444 రోజుల, 555 రోజులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ను కూడా అందిస్తోంది. సాధారణ ప్రజలకు 7.05% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్‌లకు 7.55% వడ్డీ రేటు చెల్లస్తోంది.
5 సంవత్సరాల బరోడా పన్ను పొదుపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై, సాధారణ ప్రజలకు 6.50% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్‌లు 7.15% వడ్డీ రేటును చెల్లిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే పన్ను ఆదా డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీ రేటు లభించనుంది.

English summary

Bank Of Baroda Inrcease intrest rates on fixed deposits

Bank of Baroda(BoB) has hiked interest rates on domestic fixed deposits (FD) below Rs 2 crore.

Story first published: Saturday, March 18, 2023, 10:35 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *