News
lekhaka-Bhusarapu Pavani
bonus:
కొవిడ్
మహమ్మారి
వల్ల
విమానయాన
సంస్థలు
పీకల్లోతు
నష్టాల్లో
కూరుకుపోయాయి.
2020
నుంచి
తీవ్ర
ఇబ్బందులతో
సతమతమవుతున్న
ఈ
రంగంలోని
కంపెనీలకు
2022-23
మాత్రం
బాగా
కలిసొచ్చిందనే
చెప్పాలి.
పలు
ఎయిర్
లైన్స్
కు
ఇదొక
కమ్
బ్యాక్
సంవత్సరంగా
భావించవచ్చు.
గతేడాది
భారీ
నష్టాలు
మూటగట్టుకుని,
ఈసారి
తిరిగి
పుంజుకున్న
సింగపూర్
ఎయిర్
లైన్స్
తీసుకున్న
నిర్ణయం
ఇప్పుడు
ఆసక్తిగా
మారింది.
దుబాయ్
ఆధారిత
ఎమిరేట్స్
2022-23లోనే
అత్యధిక
లాభం
3
బిలియన్
డాలర్లను
నమోదు
చేసింది.
సింగపూర్
ఎయిర్
లైన్స్
సైతం
గతేడాది
2.16
బిలియన్
డాలర్లను
ఆర్జించినట్లు
మీడియా
సంస్థలు
పేర్కొంటున్నాయి.
గతేడాది
తీవ్ర
నష్టాలలో
ఉన్న
ఈ
సంస్థ..
ఇప్పుడు
మంచి
లాభాలతో
దూసుకు
పోతోంది.

సింగపూర్
కు
చెందిన
ఈ
క్యారియర్
తన
ఉద్యోగులకు
8
నెలల
జీతాన్ని
బోనస్
గా
ఇస్తున్నట్లు
ప్రకటించి
అందరినీ
ఆశ్చర్యపరిచింది.
ఈ
మొత్తాన్ని
రెండు
భాగాలుగా
ఇవ్వనున్నట్లు
నివేదికలు
చెబుతున్నాయి.
కరోనా
ఉద్ధృతి
సమయంలో
వారు
చేసిన
పనికి
గుర్తింపుగా
6.65
నెలల
జీతానికి
సమానమైన
ప్రాఫిట్
షేరింగ్
బోనస్
మరియు
1.5
నెల
వేతనం
అదనంగా
ఇవ్వనున్నట్లు
సమాచారం.
English summary
Singapore Airlines announced 8 months salary bonus to its employees
Singapore Airlines announced 8 months salary bonus to its employees
Story first published: Friday, May 19, 2023, 8:10 [IST]