ధూమపానం, మద్యపానం. ఈ రెండు అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి.

Cause of Brain tumer
Updated On : June 8, 2025 / 5:42 PM IST
బ్రెయిన్ ట్యూమర్.. ఇది చాలా తీవ్రమైన, ప్రాణాంతకమైన జబ్బు. సాధారణం ఈ జబ్బు మెదడులో అసాధారణ కణాల పెరుగుదల వల్ల వస్తుంది. ఇటీవలి జరిగిన పరిశోధనలు ప్రకారం జీవనశైలి, కొన్ని అలవాట్లు కారణంగా ఈ వ్యాధి సంక్రమించే ఆకాశం ఉందట. చాలా సందర్భాల్లో మనం తెలియకుండానే కొన్ని తప్పులు మన మెదడును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్యలకు కారణం అవుతున్నాయి.
వాటిలో ప్రధానంగా చెప్పుకొనేవి ధూమపానం, మద్యపానం. ఈ రెండు అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి, రక్త నాళాలు, కణాలను దెబ్బతీస్తున్నాయి, క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయి, స్ట్రోక్ ప్రమాదానికి కారణం అవుతున్నాయి.
మానసిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీయడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత కారణం అవుతోంది. అంతేకాదు ఇది మెదడు కణాలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఒత్తిడి కారణంగా కణాలు దెబ్బతిని కణితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య నిద్రలేమి. నిజానికి మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. అది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు కణాలు ఒత్తిడికి గురవుతాయి. అది క్రమంగా వాపు, బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదానికి కారణం అవుతుంది.
మరొకరణం మొబైల్ ఫోన్స్. చాలా మంది గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హెడ్ ఫోన్స్ లాంటివి వాడకుండా ఫోన్‌ను చెవికి దగ్గరగా పట్టుకోని మాట్లాడం వల్ల మెదడుపై రేడియేషన్ ఎఫెక్ట్ పడుతుంది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ మెదడు కణాలను దెబ్బతీస్తాయి. అందుకే మొబైల్ వాడకాన్ని, ఎక్కువసేపు మాట్లాడటాన్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. కాబట్టి మనం రోజువారీ చేసే ఇలాంటి పనుల వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటోంది. వీటికి ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని నిపుణుల మాట.
