PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Breakfast For Diabetes : షుగర్ ఉన్నవారు ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిది

[ad_1]

షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాంటి ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

​ఏం తినాలి..

​ఏం తినాలి..

షుగర్ ఉన్నవారు ఏం తినాలి.. ఏం తినకూడదు అనే విషయంలో ఎప్పుడు ఓ అనుమానం ఉంటుంది. అందుకే వారు ముందుగా డాక్టర్‌ని కలిసి వారి హెల్త్ కండీషన్ గురించి చెప్పి ఏం తినాలో అడిగి తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

నిపుణుల ప్రకారం..

నిపుణుల ప్రకారం..

అధిక ఫైబర్, తక్కవ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ కేర్ కోచ్ శిఖా వాలియా ఓ మంచి డైట్ గురించి చెబుతున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.

​రాగి ఊతప్పం..

​రాగి ఊతప్పం..

ఫైబర్ పుష్కలంగా ఉన్న రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. వీటిని తినడం వల్ల మీకు చాలా మంచిది. షుగర్ ఉన్నవారికి ఇది హెల్దీ ఫుడ్. ఈ బ్రేక్ పాస్ట్ చేసేందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం.

​కావాల్సిన పదార్థాలు..

​కావాల్సిన పదార్థాలు..

అరకప్పు రాగిపిండి
2 టేబుల్ స్పూన్ల రవ్వ
2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి
అరకప్పు పెరుగు
కరివేపాకు కొద్దిగా
అర టీస్పూన్ బేకింగ్ సోడా
నచ్చిన కూరగాయల తరుగు కప్పు..

తయారీ విధానం..

ఇప్పుడు పిండిని తయారు చేసేందుకు.. అన్ని పదార్థాలు వేయండి. బేకింగ్ సోడా కూరగాయలు కాకుండా. ఇప్పుడు 15 నిమిషాల పాటు పిండిని అలానే ఉంచండి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత బేకింగ్ సోడా వేసి ఇప్పుడు నాన్ ‌స్టిక్ పాన్ వేడి చేయండి. దీనిపై కొద్దిగా నూనె వేసి గ్రీజ్ చేయండి. పిండిని తీసుకుని ఊతప్పంని వేసి పై నుంచి కూరగాయల ముక్కలు వేయండి. ఓ వైపు కాలాక మరోవైపు కొద్దిగా ఉడికించండి. దీనిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.

​వెజిటేబుల్ ఆమ్లెట్..

​వెజిటేబుల్ ఆమ్లెట్..

ఈ ఆమ్లెట్ రెగ్యులర్ ఆమ్లెట్‌లా కాకుండా చాలా రుచిగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. మరి దీనిని చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

చిన్న ఉల్లిపాయ తరుగు అర కప్పు
క్యాప్సికమ్ తరుగు అరకప్పు
2 గుడ్లు
2 టేబుల్ స్పూన్ల పాలు
ముప్పావు స్పూన్ ఉప్పు
అర స్పూన్ మిరియాల పొడి
2 టేబుల్ స్పూన్ల వెన్న

​తయారీ విధానం..

​తయారీ విధానం..

నాన్ స్టిక్ పాన్‌ని వేడి చేసి మీడియం మంటపై 1 టేబుల్ స్పూన్ వెన్నని కరిగించండి. దీనిపై ఉల్లిపాయ, బెల్ పెప్పర్ వేసి ఉడికించాలి. ఇప్పుడు ఓ గిన్నెలో గుడ్లు, పాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టండి. ఈ మిశ్రమాన్ని పాన్‌పై ఉన్న కూరగాయలపై పోయండి. దీనిని ఓ వైపు కాల్చి మరో వైపు కూడా కాల్చాలి. రెండు వైపులా కాల్చి తీసేయడమే.

​తయారీ విధానం..

​తయారీ విధానం..

ముందుగా శనగపిండిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, వెల్లుల్లి పొడిని వేసి బాగా కలపండి. ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇందులోని పచ్చి ఉల్లిపాయ వేసి కలపండి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ వేడి చేసి పిండిని వేసి దోశల్లా వేసి రెండు వైపులా కాల్చి తీయాలి.
Also Read : Eye Problems : కళ్ళు మసకగా కనిపిస్తున్నాయా.. డాక్టర్స్ చెప్పే జాగ్రత్తలివే..

బేసన్ పాన్‌కేక్స్..

బేసన్ పాన్‌కేక్స్..

బేసన్ అంటే శనగపిండి.. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు..

1 సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ
అరకప్పు శనగపిండి
1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్
పావు టీ స్పూన్ వెల్లుల్లి పొడి
అరకప్పు నీరు.

​ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ..

​ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ..

హెల్దీ కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేయడంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మీకు సాయం చేస్తుంద. ఈ హెల్దీ డ్రింక్‌ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ని మెంటెయిన్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గిస్తుంది. మరి ఈ డ్రింక్‌ని ఎలా తయారుచేయాలో చూద్దాం.

​కావాల్సిన పదార్థాలు..

​కావాల్సిన పదార్థాలు..

1 కప్పు ఫ్రోజెన్ స్ట్రాబెర్రీస్
సగం అరటిపండు ముక్కలు(అరటి, అవోకాడో, కివీలను తీసుకోవచ్చు. వీటి బదులు పెరుగుని కూడా తీసుకోవచ్చు)
2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్
1 కప్పు లో ఫ్యాట్ సోయా మిల్క్.

తయారీ విధానం..

ముందుగా బ్లెండర్ తీసుకుని ఈ పదార్థాలన్నీ వేసి బాగా బ్లెండ్ చేయాలి. వీటిని స్మూతీలా చేయాలి. ఇది కడుపు నిండుగా అనిపించడమే కాకుండా వారి హెల్త్‌కి చాలా మంచిది.
Also Read : Fatty liver : మీ లివర్‌కి ప్రాబ్లమ్ ఉంటే చర్మం ఇలా ఉంటుంది..

మేథీ రోటి..

మేథీ రోటి..

ఈ బ్రేక్‌ఫాస్ట్ కూడా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. మరి ఈ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

2 కప్పుల శనగ పిండి
1 కప్పు మెంతి ఆకులు
2 పచ్చిమిర్చి తరుగు
1 ఉల్లిపాయ తరుగు
1 అంగుళం అల్లం తురుము
1 టీస్పూన్ పసుపు
అర టీ స్పూన్ మిరియాల పొడి
ఉప్పు రుచికి సరిపడా
నూనె కొద్దిగా

​తయారీ విధానం..

​తయారీ విధానం..

ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని అన్ని పదార్థాలు వేసి బాగా కలపాలి. దీనిపై కొద్దిగా నూనె వేసి మరోసారి కలిపి 15 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత ఈ పిండిని ముద్దల్లా చేసి రోటీల్లా చేసి నాన్‌స్టిక్ పాన్‌పై వేసి కాల్చుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా బటర్‌ వేసి తినడమే.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu New

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *