బడ్జెట్ కి ముందు..

వ్యవసాయ ఆదాయ మార్గాన్ని మిస్ యూజ్ కావటంపై బడ్జెట్ కి ముందు చర్చ మెుదలైంది. నర్సరీలు, విత్తన కంపెనీలు, కాంట్రాక్టు వ్యవసాయ కంపెనీలు తమ కార్యకలాపాల ద్వారా ఆర్జించే ఆదాయానికి మినహాయింపును కోరిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేశంలో 45 శాతం భూములు చిన్న రైతుల చేతిలో ఉన్నాయి.

పన్ను ప్రామాణికతలు..

పన్ను ప్రామాణికతలు..

ల్యాండ్ హోల్డింగ్ లేదా పండించిన పంటల ఆధారంగా ఫ్లాట్ లంప్సమ్ పన్నును అమలు చేయవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఏడాదికి చిన్న సన్నకారు రైతులకు రూ.2.50 లక్షల లోపు వచ్చే ఆదాయం టాక్స్ పరిధిలోకి రాదుకాబట్టి వారు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు పొందుతారని వారు అంటున్నారు.

కాగ్ కనుగొన్న నిజాలు..

కాగ్ కనుగొన్న నిజాలు..

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కనుగొన్నదాని ప్రకారం కొంత మంది టాక్స్ చెల్లింపుదారులు దాదాపు రూ.50 లక్షల వరకు వ్యవసాయ ఆదాయంగా చూపించి పన్ను చెల్లించలేదని తెలిపింది. 2015-2017 మధ్య కాలంలో తనిఖీ చేసిన 22,195 ఐటీఆర్ లలో రూ.5 లక్షల కంటే ఎక్కువ వ్యవసాయ ఆదాయాన్ని క్లెయిమ్ చేసినట్లు గుర్తించింది. ఈ లూప్ హోల్ వినియోగించుకుని టాక్సులు చెల్లింపు నుంచి మినహాయింపు పొందుతున్నట్లు కాగ్ వెల్లడించింది.

పన్ను లీకేజీలు..

పన్ను లీకేజీలు..

సూత్రప్రాయంగా చెప్పుకోవలంటే.. వ్యవసాయ ఆదాయంతో సహా ఏదైనా ఆదాయం పన్నుకు లోబడి ఉండాలి. చాలా మంది రైతులు ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో ప్రకటించడం వల్ల వ్యవసాయేతర సంస్థలు తమ ఆదాయాన్ని వ్యవసాయ కేటగిరీ కింద నివేదించడం, పన్ను మినహాయింపులు పొందటం కుదరదు. ఇది సంపద అసమానతలను కూడా తగ్గిస్తుందని ఐఐఎం, అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ సుఖ్‌పాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. లిమిట్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే రైతులు వార్షిక ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసే విధానం ప్రయోజనకరమని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ దిశగా కేంద్రం ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *