[ad_1]
News
oi-Mamidi Ayyappa
Budget 2023: ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థను అక్కడి స్టాక్ మార్కెట్లు ప్రతిబింబిస్తుంటాయి. క్యాపిటల్ మార్కెట్ల పనితీరు చాలా కీలకం. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టి రిటైల్ ఇన్వెస్టర్లు, పెద్ద ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులు బడ్జెట్ ప్రసంగం కోసం ఆశగా వేచిచూస్తున్నారు.
ఆర్థిక మంత్రి ఏఏ రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను ప్రకటిస్తారు. ఆమె మాటలు ఏ రంగాన్ని ప్రభావితం చేస్తాయి.. ఏ రంగాల భవిష్యత్తు బంగారంగా మారుతుందనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. బడ్జెట్‌లో భాగంగా పన్నుల సంస్కరణలను ఆర్థిక మంత్రి కొనసాగించాలని ఆయన ఆశిస్తున్నట్లు ట్రేడ్‌ప్లస్ CEO SK హోజెఫా వెల్లడించారు.
కొత్త బడ్జెట్లో ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎనర్జీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్, సాంకేతికత & తయారీ రంగాలకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం మాంద్యంతో విలవిల్లాడుతున్న తరుణంలో 2023 వార్షిక బడ్జెట్ చాలా కీలకమని మార్కెట్ నిపుణులతో పాటు ఇన్వెస్టర్లు సైతం భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ రంగం దేశ ఆర్థికానికి కీలకం కాబట్టి అది ఆదాయాల తగ్గుదల ప్రభావాన్ని కేంద్రం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందని ఎదురుచూస్తున్నారు.
ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బెట్టింగ్ ఆదాయంగా, అలాగే ఇంట్రాడే డెరివేటివ్ అదాయాన్ని బిజినెస్ ఆదాయంగా వర్గీకరించటం జరిగింది. అలాగే ఏడాది లోపు ట్రేడింగ్ ఆదాయాన్ని స్వల్పకాల ఆదాయంగా పరిగణించటం జరుగుతోంది. అయితే మార్కెట్ ట్రేడింగ్ నుంచి వచ్చే ఆదాయాన్ని సులువుగా లెక్కించేందుకు వర్గీకరణ జరిగింది. అయితే వీటిలో ఏవైనా మార్పులు ఉంటాయా అని ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. గతంలో ట్రేడింగ్ మార్జిన్ల లెవరేజ్ ను తగ్గిస్తూ కేంద్రం దశలవారీగా పలు మార్పులు చేసింది.
అలాగే STT/CTT రేట్లలో మార్పులు ఏమైనా ఉంటాయా అనేది వేచిచూడాల్సిందే. ఎందుకంటే.. వ్యాపారులు, పెట్టుబడిదారులకు భారంగా మారిన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT), కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (CTT)లను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. STT/CTT కోసం సెక్షన్ 88E కింద రాయితీ స్వాగతించదగిన రీఇన్‌ట్రడక్షన్‌గా ఉంటుంది. అయితే ఈ సారి బడ్జెట్లో నిర్మలమ్మ వీటిపై ఎంత వరకు దృష్టి సారిస్తుందనేది తెలుసుకోవటానికి వేచిచూడాల్సిందే.
English summary
Know what Stock market Trading Community expecting from 2023 budget
Know what Stock market Trading Community expecting from 2023 budget
Story first published: Tuesday, January 10, 2023, 18:15 [IST]
[ad_2]
Source link