News
oi-Mamidi Ayyappa
Mutual Funds: భారతదేశంలో నేరుగా క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి కంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య ఎక్కువ. దీనికి సెబీ వంటి సంస్థల పర్యవేక్షణ ఉండటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. పైగా వీటిని అనుభవజ్ఞులైన మేనేజర్లు నిర్వహిస్తారు కాబట్టి చిన్న మెుత్తాల్లో పెట్టుబడులు పెట్టే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
2023 కొత్త వార్షిక బడ్జెట్లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను మరింత పెట్టుబడిదారులకు అనుకూలమైన, తదుపరి స్థాయి వృద్ధికి తీసుకెళ్లే చర్యలను ప్రతిపాదించింది. వీటిలో భాగంగా క్యాపిటల్ గెయిన్స్ లాభాలపై ఏకరీతి పన్ను విధానాన్ని తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఇన్సూరెన్స్ పెట్టుబడులు మాదిరిగా వీటిని కూడా పరిగణించాలని గతంలో సెబీ చెప్పిన రూల్స్ ను గుర్తుచేస్తున్నాయి. అలాగే భారతీయ బాండ్ మార్కెట్లను మరింత చేరువ చేయటానికి డెట్ లింక్డ్ సేవింగ్ స్కీమ్ పరిచయాన్ని పెంచాలని పరిశ్రమ భావిస్తోంది. దీనిలో భాగంగా DLSS కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్‌కు లోబడి పన్ను ప్రయోజనాలకు అర్హత పొందేలా చూడాలని ప్రతిపాదించింది.

దేశంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పెన్షన్-ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)కి అందుబాటులో ఉన్న అదే పన్ను రాయితీలకు అర్హమైనది. చందాదారులకు ప్రయోజనకరమైనది కూడా. డెట్ సెక్యూరిటీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పై పన్నుల విషయంలోనూ ఇండస్ట్రీ కొన్ని మార్పులు కోరుకుంటోంది. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడులపై పన్ను విధానాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.
దీనికి తోడు ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్ కింద ఎఫ్ఓఎఫ్లను చేర్చడం, యూనిట్ల ఇంట్రా-స్కీమ్ మార్పిడిపై పన్నుల విషయంలో సమానత్వం, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు నిర్దిష్ట దీర్ఘకాలిక ఆస్తులుగా వర్గీకరించటం వంటి కీలకమైన కోరికల చిట్టాను ఇండస్ట్రీ కలిగి ఉంది. అయితే ఈ సారి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీటికి ఎంత వరకు ప్రాధాన్యతను ఇస్తారనేది చూడాల్సిందే. దేశాభివృద్ధికి పెట్టుబడులు చాలా కీలకంగా మారినవేళ రిటైల్ ఇన్వెస్టర్ల కోరికలను కేంద్రం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది వేచిచాడాల్సిన అంశం.
English summary
know what mutual funds industry expecting from Budget 2023 in detail
know what mutual funds industry expecting from Budget 2023 in detail
Story first published: Wednesday, January 11, 2023, 14:46 [IST]