ఫోకస్ రంగం..

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం, దాని అనుబంధ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వచ్చే 3-4 త్రైమాసికాల్లో కొన్ని స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీలు లాభపడవచ్చని తెలుస్తోంది. కంపెనీల ఆర్డర్ బుక్, మార్జిన్లు మెరుగుపడతాయని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ రంగంలోని కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులు తెచ్చిపెట్టగలవని.. ముందుగా వాటిలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని వారు చెబుతున్నారు.

ఈ రంగం ఎందుకు..

ఈ రంగం ఎందుకు..

ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కీలకం. అందుకే ఈ రంగంలోని షేర్లు లాభపడవచ్చని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ చెబుతున్నారు. ఈ కారణంగా రాబోయే ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాల కంపెనీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టిలో ఉండబోతున్నాయి.

మోతీలాల్ ఓస్వాల్‌..

మోతీలాల్ ఓస్వాల్‌..

రాబోయే యూనియన్ బడ్జెట్ ప్రభుత్వం కోరుకునే విధంగా మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాలపై దృష్టి పెట్టబోతోందని మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్ & టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపారియా అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ 2023 సమర్పణ తర్వాత ఇన్‌ఫ్రా స్టాక్‌లకు ఆజ్యం పోసేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ఏదైనా పెద్ద ప్రకటన వస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు.

లాభపడే స్టాక్స్

లాభపడే స్టాక్స్

2023 బడ్జెట్ కంటే ముందు కొనుగోలు ఇన్‌ఫ్రా రంగంలోని కొన్ని షేర్లు కొనుగోలు చేయటం ఉత్తమమైన నిర్ణయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఎన్‌సీసీ , కెఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్, కమిన్స్ ఇండియా, ఎల్ అండ్ టీ మొదలైన స్టాక్‌లను గమనించాలని పొజిషనల్ ఇన్వెస్టర్లకు సూచించారు. రాబోయే యూనియన్ బడ్జెట్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి చివరి పూర్తి బడ్జెట్ అవుతుంది. ఈ క్రమంలో మోదీ సర్కార్ ప్రతిపక్షాల నుంచి దాడిని తట్టుకునేందుకు ప్రజా-కేంద్రీకృత బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Note: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. మీ అర్థిక సలహాదారుడిని ముందుగా సంప్రదించటం ఉత్తమం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *