PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

buffet: వారెన్ బఫెట్ విజయ సూత్రం ఇదే.. 130 కోట్లను 45 వేల కోట్లు్గా ఎలా మార్చారంటే..

[ad_1]

కోకో-కోలా, అమెరికన్ ఎక్స్ ప్రెస్:

కోకో-కోలా, అమెరికన్ ఎక్స్ ప్రెస్:

పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారెన్ బఫెట్ లేఖను.. వార్షిక నివేదికతో పాటు తన కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే విడుదల చేసింది. కోకో-కోలా, అమెరికన్ ఎక్స్ ప్రెస్ కంపెనీల్లో తన పెట్టుబడుల గురించి ఆయన అందులో పేర్కొన్నారు. 2.6 బిలియన్ డాలర్లను రెండు దశాబ్దాల్లో 47 బిలియన్లుగా ఎలా మార్చారో వివరించారు. 1994 ఆగస్టు నాటికి 400 మిలియన్ల కోకో-కోలా షేర్లను కొనుగోలు చేసి ఏడేళ్లు గడిచినట్లు బఫెట్ చెప్పారు. అప్పటికి వాటి విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు.అమెరికన్ ఎక్స్ ప్రెస్ లోనూ దాదాపు ఇదే మొత్తాన్ని పెట్టినట్లు తెలిపారు.

75 నుంచి 704 మిలియన్ డాలర్లకు:

75 నుంచి 704 మిలియన్ డాలర్లకు:

అదే ఏడాది కోకో-కోలా నుంచి 75 మిలియన్ డాలర్లను క్యాష్ డివిడెండ్ కింద అందుకున్నట్లు లేఖలో వెల్లడించారు. 2022 నాటికి ఆ డివిడెండ్ విలువ 704 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపారు. వయసు ఏ విధంగా పెరుగుతుందో అలాగే ఏడాదికేడాది డివిడెండ్ సైతం పెరుగుతూ వచ్చినట్లు చెప్పారు. కేవలం తాము త్రైమాసికానికి ఒకసారి వస్తున్న ఆదాయాన్ని లెక్క వేసుకోవడం తప్ప, చేసింది ఏమీ లేదన్నారు. భవిష్యత్తులో ఈ షేర్ల విలువ ఎలా ఉంటుంది అనే విషయాన్ని పెట్టుబడి పెట్టక ముందు క్షుణ్ణంగా పరిశీలించి, విలువ పెరుగుతుందని ముందే ఊహించినట్లు వివరించారు.

హోల్డింగ్స్ లో 5 శాతం:

హోల్డింగ్స్ లో 5 శాతం:

అమెరికన్ ఎక్స్ ప్రెస్ విషయంలోనూ దాదాపు ఇదే విధంగా జరిగినట్లు బఫెట్ వెల్లడించారు. 1995లో దాదాపు 1.3 బిలియన్ డాలర్లతో షేర్లు కొన్నట్లు చెప్పారు. 41 మిలియన్ డాలర్ల మంచి మొదలైన వార్షిక డివిడెండ్, 302 మిలియన్లకు పెరిగాయన్నారు. కొన్న విలువతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కానప్పటికీ, స్టాక్ విలువ పెరగడంలో డివిడెండ్ల పాత్ర ఎంతో ఉందని గమనించాలని సూచించారు. ఈ సంవత్సరాంతానికి కోక్ లో పెట్టుబడి విలువ 25 బిలియన్ డాలర్లు కాగా, అమెక్స్ విలువ 22 బిలియన్లకు చేరినట్లు పేర్కొన్నారు. వీటి నికర విలువ తన కంపెనీలో హోల్డింగ్స్ లో దాదాపు 5 శాతం ఉందని స్పష్టం చేశారు.

అప్పుడే సరైన విలువ:

అప్పుడే సరైన విలువ:

అయితే ఇదే మొత్తాన్ని అమెక్స్, కోకోకోలాలో కాకుండా 30 ఏళ్ల హై గ్రేడ్ బాండ్స్ లో పెట్టినట్లయితే.. బెర్క్‌షైర్ లో వాటి విలువ కేవలం 0.3 శాతం మాత్రమే ఉండేదన్నారు. 1990లలో ఈ పని చేసి ఉంటే, 2022 నాటికి పెట్టుబడిగా పెట్టిన అదే 1.3 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే మిగిలేదని చెప్పారు. అప్పటి లాగానే ఇప్పటికీ 80 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం మాత్రమే పొందగలిగే వాడినని స్పష్టం చేశారు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, షేర్ విలువ పెరుగుదలను అంచనా వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అప్పుడే పెట్టిన ఇన్వెస్ట్ మెంటుకు సరైన విలువ పొందవచ్చని హితవు పలికారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *