News
oi-Mamidi Ayyappa
ED
Raids:
దేశంలో
ఎడ్‌టెక్
రంగంలో
బైజూస్
తన
వ్యాపారాలను
నిర్వహిస్తోంది.
అయితే
నేడు
కంపెనీ
సీఈవో,
వ్యవస్థాపకుడు
రవీందరన్
బైజూకి
సంబంధించిన
బెంగళూరులోని
కార్యాలయాలు,
ఇళ్లలో
ఈడీ
అధికారులు
సోదాలు
నిర్వహిస్తున్నారు.
అందుబాటులో
ఉన్న
వివరాల
ప్రకారం
ఫారిన్
ఎక్స్ఛేంజ్
మేనేజ్‌మెంట్
యాక్ట్
(FEMA)
నిబంధనల
ప్రకారం
రవీందరన్
బైజు,
అతని
కంపెనీ
థింక్
&
లెర్న్
ప్రైవేట్
లిమిటెడ్’
కేసులో
డైరెక్టరేట్
ఆఫ్
ఎన్‌ఫోర్స్‌మెంట్(ED)
బెంగళూరులోని
మూడు
ప్రాంగణాల్లో
సోదాలు
జరిగాయి.

2011లో
ప్రారంభమై
2015లో
యాప్
లాంచ్
చేసిన..
ఆన్‌లైన్
ఎడ్యుకేషన్
పోర్టల్
బైజూస్
ఆఫీసుల్లో
చేపట్టిన
సోదాల్లో
అధికారులు
కీలక
పత్రాలు,
డిజిటల్
డేటాను
స్వాధీనం
చేసుకున్నారు.
ఎడ్-టెక్
యునికార్న్
2011-2023
మధ్య
కాలంలో
సూమారు
రూ.28
కోట్ల
విదేశీ
విలువైన
విదేశీ
ప్రత్యక్ష
పెట్టుబడులను
పొందినట్లు
సోదాల్లో
వెల్లడైంది.
ఇదే
కాలంలో
విదేశీ
ప్రత్యక్ష
పెట్టుబడుల
పేరుతో
కంపెనీ
దాదాపు
రూ.9,754
కోట్లను
విదేశాల
నుంచి
పొందినట్లు
వివిధ
శాఖలకు
తెలిపింది.
బైజూ,
అతని
సంస్థ
థింక్
&
లెర్న్
ప్రైవేట్
లిమిటెడ్
అడ్వర్టైజ్మెంట్,
మార్కెటింగ్
ఖర్చుల
పేరుతో
సుమారు
రూ.944
కోట్లను
ఖర్చుచేసినట్లు
విదేశీ
అధికార
పరిధికి
పంపిన
వివరాల్లో
వెల్లడించింది.
దీనికి
తోడు
2021
ఆర్థిక
సంవత్సరంలో
కంపెనీ
తన
ఆర్థిక
నివేదికలను
సిద్ధం
చేయలేదు.
అకౌంట్స్
ఆడిట్
చేయలేదు.
దీంతో
ప్రైవేట్
వ్యక్తుల
నుంచి
వచ్చిన
వివిధ
ఫిర్యాదుల
ఆధారంగా
ప్లాట్‌ఫారమ్‌పై
దర్యాప్తు
చర్యలు
ప్రారంభమయ్యాయి.

ఈ
క్రమంలో
ఈడీ
దర్యాప్తులో
భాగంగా
బైజూస్
స్టార్టప్
వ్యవస్థాపకుడు
రవీందరన్‌కు
అనేక
సార్లు
సమన్లు
జారీ
చేసింది.
అయితే
వీటి
నుంచి
అతను
తప్పించుకుంటూనే
ఉన్నాడని
తెలుస్తోంది.
దీంతో
తాజా
రైడ్స్
సంచలనంగా
మారాయి.
విచారణ
కొనసాగుతున్న
క్రమంలో
మరిన్ని
విషయాలు
తెలియాల్సి
ఉంది.
కరోనా
తర్వాత
కంపెనీ
భారీ
నష్టాలు
నమోదు
చేయటం
ఫండింగ్
సమస్యల
కారణంగా
వేల
మంది
ఉద్యోగులను
తొలగించిన
సంగతి
తెలిసిందే.
English summary
Enforcement officials raided Byju’s CEO raveendaran house and offices in Bangalore, Know details
Enforcement officials raided Byju’s CEO raveendaran house and offices in Bangalore, Know details