PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Caller ID: కావాలంటున్న ప్రభుత్వం.. కుదరదంటున్న టెలికాం కంపెనీలు !!

[ad_1]

News

oi-Bogadi Adinarayana

|

Caller ID: సాధారణంగా కాల్ వస్తున్నపుడు ఎవరు చేస్తున్నారో తెలియదు. కొత్త నంబర్ నుంచి వస్తే ఫోన్ ఎత్తాలంటే కొంత ఆలోచిస్తాం. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొబైల్‌ కు కాల్‌ వస్తున్నపుడు కాలర్ పేరు ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేయాలని చూస్తోంది. కానీ ఈ ప్రతిపాదనను టెలికాం కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది.

వినియోగదారుల భద్రత, గోప్యత, సమ్మతి, సాంకేతిక పరిమితులను పరిగణలోనికి తీసుకుంటే.. కాలర్ పేరు తెలియజేసే విధానం అమలు సాధ్యం కాదని పలు టెల్కోలు తెలిపాయి. వినియోగదారుల రక్షణ సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్, వీనో కమ్యూనికేషన్ లు ట్రాయ్ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. మొదట పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి పరీక్షించాలని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సిఫార్సు చేసింది.

కావాలంటున్న ప్రభుత్వం.. కుదరదంటున్న టెలికాం కంపెనీలు !!

సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎన్‌ఏపీ) మాత్రం కాలర్ ఐడీ అమలు తప్పనిసరి చేయకుండా సర్వీస్ ప్రొవైడర్లకు స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడింది. కాలర్ ఐడీ తప్పనిసరి చేయడానికి అంగీకరించిన భారతీ ఎయిర్‌ టెల్.. సాధారణ వినియోగదారులకు సైతం ఈ సేవను అందుబాటులో ఉంచాలనుకోవడంతో విభేదించింది.

కావాలంటున్న ప్రభుత్వం.. కుదరదంటున్న టెలికాం కంపెనీలు !!

ప్రజల వ్యక్తిగత సమ్మతి అవసరం కాబట్టి సీఎన్‌ఏపీ అనేది ఓ ఎంపిక సేవగా ఉండాలని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అభిప్రాయపడింది. కాలర్ సమాచారం భద్రత గురించి పునరాలోచించాలని సూచించింది. డేటా రక్షణ చట్టం అమలు తర్వాతే ఈ వ్యవస్థను అమలు చేయాలని ప్రతిపాదించింది.

English summary

Trai asked telecom industry opinion on caller id display

Telecom companies denying trai recommendations on called id..

Story first published: Saturday, January 21, 2023, 7:14 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *