[ad_1]
ట్రీట్మెంట్..
అనేక పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే.. క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీని వల్ల సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు..
క్యాన్సర్ ట్రీట్‌మెంట్ విషయంలో ముందుగా అనేక రకాల మెడిసిన్స్, రేడియేషన్ థెరపీ, సర్జరీలు ఉంటాయి. అయితే, వచ్చిన క్యాన్సర్‌ని బట్టి, ఆ స్టేజ్‌ని బట్టి, లక్షణాల తీవ్రతని బట్టి పేషెంట్స్‌ని పరీక్షించిన డాక్టర్స్ ఏ ట్రీట్‌మెంట్ సరైనదో చెబుతారు.
ఇంటి చిట్కాలు..
అయితే, క్యాన్సర్స్‌ని చాలా వరకూ ట్రీట్‌మెంట్ ద్వారానే తగ్గించొచ్చు కానీ, అదే టైమ్‌లో కొన్ని ఇంటి చిట్కాలు కూడా సమస్య తీవ్రతని తగ్గిస్తుంది. అందులో ముఖ్యమైనది మందారపువ్వు. మందారపువ్వు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌ని తగ్గించడంలో ఎలా పని చేస్తుందో చూద్దాం.
Also Read : Irresponsible wife : నా భార్య జీతం మొత్తం షాపింగ్ చేస్తోంది.. అడిగితే..
NCBI నివేదిక ప్రకారం..
మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ ట్రీట్‌మెంటకి అనేక ట్రీట్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని సార్లు సైడ్‌ఎఫెక్ట్స్‌ని చూపిస్తాయి. అయితే, ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
Also Read : Eyestrain : కళ్ళు మంటగా అనిపిస్తున్నాయా.. ఇలా చేయండి..
బ్రెస్ట్ క్యాన్సర్‌కి మందారతో చెక్..
కొన్ని సహజ పదార్థాలను వాడడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మందారపువ్వు జ్యూస్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి మంచిదని, ఇందులో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా మంచివి.
Also Read : Weight loss Workout : ట్రెడ్‌మిల్‌పై నడిస్తే బరువు తగ్గుతారా..
మందారలోని గుణాలు..
మందారలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ అధ్యయనాల క్యాన్సర్ కణాలపై మందార ఎక్స్‌ట్రాక్ట్స్ మంచి రిజల్టస్‌ని ఇస్తాయి. ఓ టెస్ట్ ట్యూబ్ పరిశోధనలో మందార సారం కణాల పెరుగుదలను బలహీన పరిచి నోరు, ప్లాస్మా కణ క్యాన్సర్‌ల ఇన్వాసివ్‌నెస్‌ని తగ్గించింది.
పరిశోధనల్లో తేలింది ఇదే..
మరో టెస్ట్ ట్యూబ్ పరిశోధనలో మందార ఆకు సారం మానవ ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలను వ్యాప్తి చేయకుండా నిరోధించిందని నివేదించింది. మందార సారం.. అనేక క్యాన్సర్స్‌ని దూరం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.
మందారపువ్వు రసంలో యాంటీ ఆక్సిడెంట్, హైపోలిమిడెక్ ప్రభావాలు ఉన్నాయి. వీటితో పాటు యాంటీ కాన్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.
కేవలం మందార జ్యూస్ మాత్రమే కాదు..
మందార పువ్వు జూస్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, కేవలం ఇది మాత్రమే తీసుకోవడం కాదు. మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవడంతో కలిపి దీనిని తీసుకోవడం వల్ల వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దూరమవుతాయని చెబుతున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో మందారపువ్వు జ్యూస్ ప్రభావంపై జరిగిన పరిశోధనలు, మందార రసం ట్రిపుల్ నెగటివ్, ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు.
ఎలా వాడాలంటే..
బ్రెస్ట్ క్యాన్సర్‌ని తగ్గించడంలో మందార పువ్వు రసం హెల్ప్ చేస్తుందని చెప్పినట్లుగానే.. దీనిని ఎలా వాడాలంటే ముందుగా మందారపువ్వుల్ని శుభ్రం చేసి నీటిలో కలిపి మరిగించాలి. దీనిని చల్లార్చి వడకట్టి తాగాలి. అయితే, వీటిని తాగే ముందు ఓ సారి డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని గుర్తుపెట్టుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link