Tuesday, April 13, 2021

CD Scandal: నాకు జ్వరం… రాలేను, 2019 లో పీజీ లేడీ ఎంట్రీ, ఆరోజు, రాసలీలల కేసులో ట్విస్ట్ !

సార్…. నాకు జ్వరం వచ్చింది

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారం కేసుకు సంబంధించి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకావలసి ఉంది. అయితే తనకు జ్వరం వస్తోందని, అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని రమేష్ జారకిహోళి ఆయన న్యాయవాది శ్యామ్ సుందర్ తో సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 అలా చెయ్యాలని డాక్టర్లు చెప్పారు సార్

అలా చెయ్యాలని డాక్టర్లు చెప్పారు సార్

అనారోగ్యంతో తాను చికిత్స చేయించుకుంటున్నానని, తనను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, అందువలన తాను సోమవారం విచారణకు మీ ముందు హాజరౌతానని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఆయన న్యాయవాది శ్యామ్ సుందర్ ద్వారా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి సూచించారు.

 అపార్ట్ మెంట్ లో లేడీ విచారణ

అపార్ట్ మెంట్ లో లేడీ విచారణ

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి తన మీద అత్యాచారం చేశాడని కేసు పెట్టిన పీజీ సుందరిని సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. రాసలీలల సీడీ తీశారని సీడీ లేడీ చెప్పిన బెంగళూరులోని మల్లేశ్వరం సమీపంలోని రమేష్ జారకిహోళికి చెందిన లగ్జరీ అపార్ట్ మెంట్ లోకి సీడీ లేడీని పిలుచుకుని వెళ్లి అక్కడ సిట్ విచారణ అధికారిని ఎంసీ. కవితా సమక్షంలో పంచనామా నిర్వహించారు.

 2019 డిసెంబర్ లో ?

2019 డిసెంబర్ లో ?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జరాకిహోళికి, బెంగళూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పీజీలో ఉండే సీడీ లేడీకి 2019 డిసెంబర్ లో పరిచయం అయ్యిందని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఓ షార్ట్ ఫిల్మ్ తియ్యడానికి సహాయం చెయ్యాలని సీడీ లేడీ మొదట రమేష్ జారకిహోళిని కలిసిందని సిట్ అధికారుల విచారణలో వెలగు చూసింది.

 ఆరోజు నుంచి ఈ రోజు వరకు ?

ఆరోజు నుంచి ఈ రోజు వరకు ?

మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి బెంగళూరులోని మల్లేశ్వరం సమీపంలో లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ లోని రమేష్ జారకిహోళి ఫ్లాట్ లోనే రాసలీలల సీడీ తీశారని పీజీ లేడీ అంటోంది. 2019 డిసెంబర్ నెల నుంచి రాసలీలల సీడీ లీక్ అయ్యే వరకు సీడీ లేడీ రమేష్ జారకిహోళి ఫ్లాట్ కు ఎన్నిసార్లు వచ్చి వెళ్లింది ? అంటూ సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. రమేష్ జారకిహోళి అపార్ట్ మెంట్ అడ్రెస్ ఆమెకు ఎవరు ఇచ్చారు, ఆ ఫ్లాట్ కు ఆమె ఎన్నిసార్లు వచ్చింది, ఎందుకు వచ్చింది ?, విజిటర్స్ ఎంట్రీ బుక్ లో ఆమె అసలు పేరు రాసిందా ? అంటూ సిట్ అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.

 మేడమ్ కు మొబైల్ మొదటి గిఫ్ట్ ?

మేడమ్ కు మొబైల్ మొదటి గిఫ్ట్ ?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి సీడీ లేడీ పరిచయం అయిన తరువాత ఆమెకు ఆయన భారీగానే గిఫ్ట్ లు తీసిచ్చాడని వెలుగు చూసింది. 2020 జనవరి నెలలో సీడీ లేడీకి ఖరీదైన మొబైల్ ఫోన్ తీసిచ్చారని, తరువాత అప్పుడప్పుడు బంగారు నగలు తీసిచ్చాడని వెలుగు చూసింది.

 సార్ ఇచ్చింది ఇవే.... మీరే తీసుకోండి ?

సార్ ఇచ్చింది ఇవే…. మీరే తీసుకోండి ?

కర్ణాటక మాజీ మంత్రి ఏమేమి గిఫ్ట్ లు ఇచ్చారో అవి మొత్తం సీడీ లేడీ సిట్ అధికారులకు ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో కథ రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, సీడీ లేడీని ఇప్పటి వరకు సిట్ అధికారులు వేర్వేరుగా విచారణ చేసి వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు.


Source link

MORE Articles

Roof Of The World: तिब्बत के पठार पर Global Warming का खतरा, तापमान बढ़ने पर तेजी से पिघल रहे ग्लेशियर

बीजिंग: हाल ही में उत्तराखंड (Uttarakhand) में ग्लेशियर (Glacier) फटने से लगभग 80 लोगों की जान चली गई थी. हिमालय (Himalaya) पर मंडराते...

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా మొబిలిటీ కొత్తగా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి అని, లాస్ట్ మైల్ డెలివరీ కోసం పర్యావరణ సాన్నిహిత్యమైన...

పెళ్లి ఆపిన ‘బుల్లెట్’.. బైక్ కోసం వరుడి నానా యాగీ, గుర్రం దిగీ మరీ హంగామా..

డ్రెస్ విప్పేసి నానా హంగామా.. పెళ్లిలో వరుడికి బైక్ ఇస్తుంటారు. కారు ఇస్తుంటారు. బంగారు గొలుసు పెడతాం అని చెబుతారు. వధువు తరపువారు మాట ఇస్తుంటారు....

पानी में भिगाकर ऐसे करें दालचीनी का इस्तेमाल, होंगे ये 6 फायदे

अगर दालचीनी के पानी का सही मात्रा सेवन किया जाए, तो महिलाओं खुद को कई गंभीर बीमारियों से बचा सकती हैं.  Source link

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe