Tuesday, April 13, 2021

CD Scandal: స్టోరీ మొత్తం చెప్పిన సీడీ లేడీ, మేడమ్ కు నిక్ నేమ్, భారీ గిఫ్ట్ లు ?, 300 స్క్రీన్ షాట్స్ !

నేను ఎందుకు కలిశానంటే ?

మంత్రి పదవిలో ఉన్న రమేష్ జారకిహోళిని తాను ఎందుకు కలిశానో అనే విషయాన్ని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పింది. ఓ షార్ట్ ఫిల్మ్ తియ్యడానికి సహాయం చెయ్యాలని మంత్రి పదవిలో ఉన్న రమేష్ జారకిహోళిని తాను కలిశానని, తరువాత అప్పటి నుంచి రమేష్ జారకిహోళి తనతో చాలా చనువుగా ఉండటానికి ప్రయత్నించారని సీడీ లేడీ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చిందని తెలిసింది.

 షార్ట్ ఫిల్మ్ తో ఏం వస్తుంది.... ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటి

షార్ట్ ఫిల్మ్ తో ఏం వస్తుంది…. ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటి

షార్ట్ ఫిల్మ్ తీస్తే నీకు ఏమీరాదని, నీకు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రమేష్ జారకిహోళి తనకు చెప్పాడని. మంచి ఉద్యోగం వస్తే జీవితంలో సెటిల్ అవ్వడానినికి అవకాశం ఉంటుందని తాను ఆశపడి ఆయన్ను అప్పటి నుంచి ఎప్పుడంటే అప్పుడు కలిశానని, ఇద్దరి మద్య చనువు ఎర్పడిందని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని విశ్వసనీయ సమాచారం.

 ఆ దెబ్బతో అసలు సినిమా

ఆ దెబ్బతో అసలు సినిమా

మంత్రి పదవితో పాటు ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉన్న రమేష్ జారకిహోళి మాటలు నమ్మిన తాను అప్పటి నుంచి ఆయన పిలిచినచోటకు వెళ్లానని, తనను లైంగికంగా లొంగదీసుకున్న రమేష్ జారకిహోళి చివరికి రాసలీలల సీడీ తీసేవరకు వెళ్లిందని, తరువాత రమేష్ జారకిహోళి తనను మోసం చేసి నిలువునా ముంచేశాడని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని సమాచారం.

 300 వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్

300 వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్

అప్పుడప్పుడు తనకు రమేష్ జారకిహోళి ఫోన్ చేసేవాడని, వాట్సాప్ వీడియో కాల్స్ చేశాడని, ఆ సందర్బంలో అశ్లీలంగా తనతో మాట్లాడుతూ ఆయన కాలం గడిపాడని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని తెలిసింది. అంతే కాకుండా రమేష్ జారకిహోళి తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన 300 స్క్రీన్ షాట్స్ కూడా సీడీ లేడీ సిట్ అధికారులకు అందించిందని వెలుగు చూసింది.

 సార్ సూపర్... మేడమ్ కు ముద్దుపేరు ఏమిటంటే ?

సార్ సూపర్… మేడమ్ కు ముద్దుపేరు ఏమిటంటే ?

మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సీడీలేడీకి ఓ ముద్దుపేరు పెట్టారని తెలిసింది. మాజీ మంత్రి సీడీ లేడీని ‘బేబి’ అని పిలిచేవాడని తెలిసింది. ఉదయం నిద్రలేవగానే గుడ్ మార్నింగ్, రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ అంటూ మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తనకు వాట్సాప్ మెసేజ్ లు పంపించేశాడని ఆ సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని తెలిసింది.

 భారీగా బంగారు నగలు, మొబైల్ ఫోన్ గిఫ్ట్ ?

భారీగా బంగారు నగలు, మొబైల్ ఫోన్ గిఫ్ట్ ?

అంతేకాకుండా మాజీ మంత్రి రమేష్ జారకిహొళి సీడీ లేడీకి అనేకసార్లు బంగారు నగలు, విలువైన మొబైల్ ఫోన్ తోపాటు ఖరీదైన గిఫ్ట్ లు తీసిచ్చాడని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసిందని సమాచారం. మొత్తం మీద రమేష్ జారకిహోళి, తన మద్య వాట్సాప్ మెసేజ్ లు చాలానే జరిగాయని ఆరోపిస్తూ సీడీ లేడీ 300ల స్క్రీన్ షాట్స్ సిట్ అధికారులకు ఇచ్చిందని ప్రముఖ కన్నడ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.


Source link

MORE Articles

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

नवरात्रि के व्रत में अगर खाएंगे ये चीजें तो नहीं होंगे डिहाइड्रेशन के शिकार

नवरात्रि शुरू हो गए हैं. इन दिनों बहुत से लोग नौ दिनों तक व्रत रखते हैं. इन दिनों मां दुर्गा के नौ स्वरूपों...

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ – ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

పసుపు కండువా తలకట్టుతో జూనియర్.. ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్...

Weight Loss Tips: जीरा और दालचीनी, किचन के ये 2 मसाले तेजी से वजन घटाने में करेंगे मदद

नई दिल्ली: जब बात मोटापा कम करने की आती है तो ज्यादातर लोग डाइटिंग (Dieting) करने लग जाते हैं और सोचते हैं कि...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe