[ad_1]
News
oi-Chekkilla Srinivas
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
59 ఏళ్ల చందా కొచ్చర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ అయిన వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసిఐసిఐ బ్యాంక్ సీఇఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా 2018 అక్టోబర్‌లో వైదొలిగారు. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చి కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు లావాదేవీల వల్ల లబ్ధి పొందారని విజిల్‌బ్లోయర్ ఆరోపించారు.
వీరిని వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై ఈ కేసుకు సంబంధించి వారిని ముందుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, వారు విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.చందా కొచర్, దీపక్ కొచర్‌లను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. తొలి చార్జి షీటును కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
English summary
Former ICICI Bank CEO, MD Chanda Kochhar and her husband Deepak Kochhar have been arrested
Former ICICI Bank CEO, MD Chanda Kochhar and her husband Deepak Kochhar have been arrested by the CBI. They were arrested on charges of fraud and irregularities in loans to Videocon Group.
Story first published: Saturday, December 24, 2022, 12:25 [IST]
[ad_2]
Source link