PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Chloride Deficiency: క్లోరైడ్‌ లోపం ఉంటే.. ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!


Chloride Deficiency: మన శరీరానికి కావలసిన పోషకాలలో క్లోరైడ్ ఒకటి. క్లోరైడ్‌ మన శరీరంలోని ముఖ్యమైన కదలకలకు సహాయపడుతుంది. అయితే.. ఈ సూక్ష్మపోషకం గురించి మనలో చాలా మంది సీరియస్‌‌గా తీసుకోరు. అసలు మన శరీరానికి క్లోరైడ్‌ ఎందుకు అవసరం? ఎంత అవసరం? క్లోరైడ్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం.

క్లోరైడ్‌ ఎందుకు సహాయపడుతుంది..?

సోడియం, పొటాషియం వంటి పోషకాల వలె.. క్లోరైడ్‌ మన శరీరంలోని అనేక విధులకు సహాయపడుతుంది. క్లోరైట్‌ మన కణాల పొరలలో రక్త నాళాల కదలికను ప్రేరేపింస్తుంది. శరీరం సాఫీగా కదిలేలా చేస్తుంది.

బీపీ కంట్రోల్‌లో ఉంచుతుంది..

బీపీ కంట్రోల్‌లో ఉంచుతుంది..

క్లోరైడ్ మన శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించడానికి పనిచేస్తుంది. ఎలాంటి పోషకాలు కణాలలోకి ప్రవేశించాలి, బయటకు రావాలి అనేది క్లోరైడ్‌ కంట్రోల్‌ చేస్తుంది. క్లోరైడ్‌ శరీరంలోని నీరు, ఇతర ద్రవాల సరైన నిర్వహణకు సహాయపడుతుంది. శరీర pH స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. క్లోరైడ్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో క్లోరైడ్ కీలక పాత్ర పోషిస్తుంది. మనం తిసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించేందుకు, జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే పేగుల్లో సరైన మోతాదులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి కావాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ ఉత్పత్తిని చేయడంలో, సరైన మొత్తంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్స్‌ విడుదల చేయడంలో క్లోరైడ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

గుండె కండరాల కదలిక సహాయపడుతుంది..

గుండె కండరాల కదలిక సహాయపడుతుంది..

క్లోరైడ్ మన శరీర కండరాల కదలికలో తోడ్పడుతుంది. ఇది గుండె కండరాల సంకోచం, విస్తరణలో సహాయపడుతుంది. నరాల కణాల ద్వారా మెదడు, శరీరానికి మధ్య సందేశాలను (నరాల ప్రేరణలు) ప్రసారం చేయడంలో క్లోరైడ్ పాత్ర ఉంటుంది. మన శరీరంలోని రక్తకణాల పనితీరు సజావుగా సాగేందుకు ఆక్సిజన్ అవసరం.

ఎంత క్లోరైడ్‌ అవసరం..

ఎంత క్లోరైడ్‌ అవసరం..

మన శరీరానికి ఎంత క్లోరైడ్‌ అవసరమో.. మన వయస్సు, లింగం, శారీరక స్థితిని బట్టు మారుతూ ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారికి.. రోజుకు సగటున 3 గ్రాముల క్లోరైడ్ అవసరం. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు సగటున 3 గ్రాముల క్లోరైడ్ కావాలి.

క్లోరైడ్‌ లోపం ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయి..

క్లోరైడ్‌ లోపం ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయి..

క్లోరైడ్ లోపాన్ని హైపోగ్లైసీమియా అంటారు. క్లోరైడ్‌ లోపం ఉంటే.. చర్మం, శరీరంలో చలనం లేకపోవడం, మానసిక స్థితి గందరగోళంగా ఉండటం, క్రమరహిత హృదయ స్పందన, కండరాల, నరాల నొప్పులు ఉంటాయి.

ఈ ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది..

ఈ ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది..

ఉప్పులో సోడియం క్లోరైడ్‌ను ఎక్కువగా తీసుకోవడానికి బదులుగా, మీరు కొన్ని ఆహారాల నుంచి కూడా కొంత మొత్తంలో క్లోరైడ్‌ను పొందవచ్చు. టమాటా, ఆలివ్ ఆయిల్‌, ఆకు కూరలు, సీ వీడ్‌, రొయ్యలు, సోయా సాస్‌లో క్లోరైడ్‌ ఉంటుంది. ఇవి మీ ఆహారంలో తీసుకుంటే క్లోరైడ్‌ లోపం రాదు.

క్లోరైడ్‌ ఎక్కువైతే..

క్లోరైడ్‌ ఎక్కువైతే..

మన శరీరం సాఫీగా పనిచేయడానికి 3 గ్రాముల క్లోరైడ్‌ సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ తీసుకోవలసిన అవసరం లేదు. మన శరీరంలో సోడియం క్లోరైడ్ స్థాయిలు ఎక్కువైతే.. హైపర్‌టెన్షన్‌‌, గుండె సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *