
Cm Chandrababu: రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయో తెలుపుతూ 3 నెలలకు ఒకసారి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నాం, లబ్దిదారుల ఇళ్ళకి ఎంతమంది మంత్రులు వెళ్లారని అడిగారు చంద్రబాబు. అయితే, ఏ మంత్రి కూడా లబ్దిదారుల ఇంటికి వెళ్లకపోవటంపై సీఎం అసంతృప్తి తెలిపారు. తానే లబ్దిదారుల ఇంటికి వెళ్లి కాఫీ తాగుతున్నప్పుడు.. మంత్రులు ఎందుకు ఆ పని చేయట్లేదని ప్రశ్నించారు.
ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఏలూరులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ బర్లీ పొగాకు సమస్యపై చర్చించారు.
Also Read: వారి వల్ల దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం.. ఆ దాడులను తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతోంది: పవన్
ధరల నిర్ణయాక కమిటీలో కొత్తగా మంత్రులు గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడును చేర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీశైలంకు రద్దీ బాగా పెరిగి ఆదాయంలో రెండవ స్థానంలో ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు మంత్రులు. ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని మంత్రులతో అన్నారు సీఎం చంద్రబాబు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.