PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

CM Jagan: ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం.. విశాఖ సమ్మిట్‍లో సీఎం జగన్..


News

oi-Chekkilla Srinivas

|

30 లక్షల కోట్ల పెట్టుబడితో 20 రంగాల్లోని 6 లక్షల మందికి ఉపాధితో 340 ప్రతిపాదనలు అందాయని సీఎం జగన్ ప్రకటించారు. ఈరోజు 11 లక్షల కోట్ల విలువైన 92 ఎంఓయూలను చేసుకుంటామని చెప్పారు. మిగిలిన శనివారం చేస్తాన్నారు. రాష్ట్రం అందించే అవకాశాలు, ఆరోగ్యకరమైన పోటీ, దీర్ఘకాలిక భాగస్వామ్యానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరుతున్నాట్లు జగన్ వివరించారు. జీ20 సదస్సు భారత్ కు కీలకమని అన్నారు.

మోడీ నేతృత్వంలోని భారత్ జీ20 నాయకత్వం మాకు నిర్ణయాత్మక క్షణం అవుతుందని జగన్ చెప్పారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉందన్నారు. ఏపీలో అభివృద్ధి చెందిన ఓడరేవులు, 6 విమానాశ్రయాలు, 3 పారిశ్రామిక కారిడార్లు, వ్యూహాత్మక ప్రదేశం, నైపుణ్యం కలిగిన యువత, విధాన ఫ్రేమ్‌వర్క్‌తో చురుకైన ప్రభుత్వంతో కూడిన బలమైన ఇన్‌ఫ్రా రాష్ట్రానికి సహాయపడుతున్నాయన్నారు.

CM Jagan: ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం..

ఏపీ అత్యధిక gsdp వృద్ధిని సాధించిందన్నారు. ఎగుమతులు పెరిగాయిన్నారు. ఏపీకి డీకార్బనైజేషన్, పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రా – తూర్పు నుంచి పొడవైన తీర రేఖ గేట్‌వే, డిజిటలైజేషన్, వ్యవస్థాపకత ముఖ్యమన్నారు. భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగే అవకాశం ఏపీకి ఉందన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ అని గుర్తు చేశారు. దేశీయంగా అంతర్జాతీయ ఆమోదాల కోసం వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 21 రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు.

రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 26 నైపుణ్య కళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి జరగడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. APలోని వివిధ రంగాల చాలా అవకాశం ఉందని.. వాటిని గుర్తించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మేము ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నామని.. ఇది తమ హామీ జగన్ చెప్పారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉంటుందని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

English summary

CM Jagan said that there are many opportunities for investment in AP

CM Jagan said that there are many opportunities for investment in AP



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *