PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

CM Jagan: ‘పేదలందరికీ ఇళ్లు’పై సీఎం సమీక్ష.. మార్చి నాటికి 5 లక్షల గృహాల నిర్మాణమే లక్ష్యం

[ad_1]

పేదలకు పంచిన భూముల విలువెంత?

పేదలకు పంచిన భూముల విలువెంత?

‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై గృహనిర్మాణ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉండకుండా, అత్యంత నాణ్యమైన ఇళ్లను అందించాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన లే అవుట్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో వసతులు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటివరకు ఇళ్లపట్టాల రూపేణా పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు కాగా.. వాటి విలువ రూ.56,102.91 కోట్లని ప్రకటించారు.

కోర్టు కేసుల వల్ల..

కోర్టు కేసుల వల్ల..

వర్షాలు తగ్గిన అనంతరం గత డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. నాణ్యతా లోపాలు ఏమైనా ఉంటే గుర్తించేందుకు వీలుగా 36 ల్యాబ్‌ లు ఏర్పాటు చేశామన్నారు. నిర్మాణంలో వినియోగించే మెటల్ నాణ్యతపై 285, సిమెంటుపై 34, స్టీలుపై 84, ఇటుకలపై 95 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోర్టు కేసుల వల్ల ప్రకాశం, అనంతపురం జిల్లాలోని రెండు లే అవుట్లకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ కారణంగా 30 వేల మందికి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగ్గా, త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు:

మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు:

ఈ ఆర్థిక సంవత్సరంలో పేదల ఇళ్ల కోసం ఇప్పటివరకు రూ.7,630 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా రూ.13,780 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో 74 వేల ఇళ్లు శ్లాబు దశలో, మరో 79 వేలు రూఫ్ లెవల్లో ఉన్నట్లు వివరించారు. మార్చి నాటికి 5 లక్షల గృహాల నిర్మాణం పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

పూర్తయిన గృహాలకు 15 రోజుల్లోగా ట్రాన్స్‌ కో అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు.

 టిడ్కో లబ్ధిదారులకు చాలా చేశాం:

టిడ్కో లబ్ధిదారులకు చాలా చేశాం:

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం గణనీయమైన సాయం అందించిందని సీఎం జగన్ తెలిపారు. గత మూడున్నరేళ్లలో కేవలం ఇళ్ల నిర్మాణమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన, ఉచితంగా 300 అడుగుల ఇళ్లు, ఇతర కేటగిరీల లబ్ధిదారులకు సబ్సిడీ, ఫ్రీ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తుచేశారు. EMI, ఇసుక పంపిణీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, సబ్సిడీపై సామాగ్రి అందజేత భారాన్ని ప్రభుత్వమే తీసుకున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ కలిపి చూస్తే, టిడ్కో గృహాల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.8,015 కోట్లు వెచ్చిస్తే.. తాము ఇప్పటి వరకు అందించిన ప్రయోజనాల విలువ రు.20,745 కోట్లని ప్రకటించారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *