[ad_1]
కైపెక్కించే రెడ్ కలర్ తో..
Colaphoneglobal అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా Colaphone ఇప్పటికే సోషల్ మీడియాకు పరిచయం అయింది. ఫిజీ డ్రింక్-మేకర్ ఐకానిక్ లోగో, సిగ్నేచర్ రెడ్ కలర్ థీమ్ తో చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ ఉందని మొబైల్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. చూడటానికి ఇది రియల్ మీ 10 4G ఫోన్ లాగా ఉందని ఇట్టే అర్థమవుతోంది.
టీజర్లు ఆల్రెడీ రిలీజ్డ్…
‘రియల్లీ రిఫ్రెషింగ్’, ‘ఛీర్స్ ఫర్ రియల్’ అంటూ కోకాకోలా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న టీజర్లను రియల్ మీ ఇప్పటికే విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని స్పెషల్ ఎడిషన్ లను మార్కెట్ లోకి తీసుకురావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే వన్ ప్లస్, ఒప్పో బ్రాండ్లు మెక్ లారన్, ఎవెంజర్ ఎడిషన్లతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ లిస్టులోకి ఇప్పుడు రియల్ చేరబోతుందని భావిస్తున్నారు.
ఇవీ స్పెసిఫికేషన్స్..
మొబైల్ హార్డ్ వేర్ గురించిన వివరాలు బహిర్గతం కానప్పటికీ.. రియల్ మీ 10 మోడల్ రీబ్రాండెడ్ గా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. అదే జరిగితే 6.4 అంగుళాల్లో 1080p రిజల్యూషన్ తో కూడిన AMOLED డిస్ ప్లే, MediaTek Helio G99 చిప్, అండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ UI 3.0 సాఫ్ట్ వేర్, 50 MP కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో పొందుపరుస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
[ad_2]
Source link