Monday, April 12, 2021

Coronavirus:సూపర్ స్ప్రెడర్‌గా సభలు సమావేశాలు – అక్కడినుంచే: నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే..?

National

oi-Kannaiah

|

కరోనా వైరస్ కేసులు భారత్‌లో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా పరిస్థితిని పరిశీలిస్తే అంతే క్రమంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఇక కొత్తగా పెరుగుతున్న కేసులు ఎక్కువగా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించినవనే చర్చ ప్రారంభమైంది. అయితే ఈ చర్చను నిపుణులు తప్పుబడుతున్నారు. కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయంటే అందుకు కారణం కొత్త స్ట్రెయిన్‌ కాదని పెద్ద ఎత్తున జనాలతో కూడిన కార్యక్రమాలే అని చెబుతున్నారు. అవును ఒక వేడుక లేదా ఏదైనా రాజకీయ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఇక్కడి నుంచి కరోనావైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు సూపర్ స్ప్రెడర్‌ ద్వారా వచ్చినవే అని నిపుణులు చెబుతున్నారు.

ఇక సభలకు ఆయా కార్యక్రమాలకు ప్రజలు హాజరుకావడం అందులో ఎవరికైనా ఒకరికి కరోనా సోకి ఉండి ఉంటే వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందడం … అక్కడి నుంచి వారు వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేయడంతోనే కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందని కర్నాటకలోని ఓ నిపుణుడు చెప్పారు.వీరే సూపర్ స్ప్రెడర్స్‌గా తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.అంతేకాదు ఈ మధ్య కాలంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు, జాగ్రత్తలు, ట్రాకింగ్ వంటి అంశాలపై స్థానిక ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే మహారాష్ట్రలో కనిపించిన వేరియంట్‌ వల్లే కేసులు పెరుగుతున్నాయనే వాదనలో వాస్తవం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వైరస్ మార్పులు కనిపించాయని వివరించారు. జన్యుక్రమంను నిమ్‌హాన్స్‌లో పరీక్షిస్తున్నామని చెప్పారు. 440 మరియు 480 మ్యూటేషన్స్ వేర్వేరుగా ఉన్నట్లు తాము గమనించామని చెప్పారు. ఈ రెండు కరోనా వేరియంట్లు లాక్‌డౌన్ తర్వాత వ్యాప్తి చెందాయని వెల్లడించారు. ఇక ఈ రెండు కరోనా వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందా అని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.

ఇక కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా గైడ్‌లైన్స్ మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని.. ఈ సమయంలో గట్టి నిఘాతో పాటు వ్యాధిని నియంత్రించడం, జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించరాదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.


Source link

MORE Articles

రంజిత్ రామచంద్రన్: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. గుడిసె నుంచి మొదలైన జర్నీ…

ఎవరీ రంజిత్ రామచంద్రన్... కేరళలోని కసర్‌గఢ్ జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో రంజిత్ రామచంద్రన్ జన్మించాడు. ఆయన తల్లి నరేగా ఉపాధి కూలీ,తండ్రి టైలర్.టార్ఫాలిన్...

విషాదం : పండగ గ్రాండ్‌గా జరుపుకోవాలనుకున్న కుటుంబం… స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు…

కారులో బయలుదేరిన కుటుంబం... ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్ రెడ్డి(45) భార్య సుజాత(40),కుమార్తె నేహారెడ్డి(12),కుమారుడు సూర్యతేజలతో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో...

इन लोगों के लिए कमाल कर सकता है सौंठ वाला दूध, बस जान लें सेवन का सही तरीका, मिलेंगे गजब के फायदे

नई दिल्ली: अगर आप जल्दी थक जाते हैं तो यह खबर आपके काम आ सकती है. हम आपको एक ऐसी चीज के बारे...

नाश्ते में एक उबला हुआ अंडा खाने के फायदे जान लेंगे तो रोजाना खाएंगे

नई दिल्लीः कहा जाता है कि नाश्ता हमारे भोजन का सबसे अहम हिस्सा होता है. ऐसे में सभी हेल्थ न्यूट्रीशन बताते हैं कि...

Employees at Tencent Music, Meituan, and other Chinese tech giants are expecting increased antitrust scrutiny and penalties after Alibaba's record $2.8B fine (Yuan Yang/Financial...

Yuan Yang / Financial Times: Employees at Tencent Music, Meituan, and other Chinese tech giants are expecting increased antitrust scrutiny and penalties after...

New Trailers: Cruella, The Woman in the Window, Loki, and more

So yesterday I watched the first episode of the Netflix documentary This is a Robbery, about the 1990 heist at the...

VW teases larger ID.6 electric SUV ahead of auto show debut | Engadget

VW has yet another round of electric vehicles in the pipeline, and it's not waiting until the official launch to offer a hint...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe