PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Crude Oil: అంతర్జాతీయంగా తగ్గుతున్న చమురు ధరలు.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా..!


News

oi-Chekkilla Srinivas

|

చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం కూడా చమురు ధరలు తగ్గాయి. U.S. క్రూడ్ ఫ్యూచర్స్ 2.1% తగ్గి బ్యారెల్‌కు $66.90 వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ కాంట్రాక్ట్ 2.1% తగ్గి బ్యారెల్‌కు $73.11కి చేరుకుంది. రెండు బెంచ్‌మార్క్‌లు ఈ వారంలో 11% పైగా తగ్గాయి. ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్ద తగ్గుదలగా నమోదు అయింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా.. దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు.

మరోవైపు రష్యా నుంచి భారత చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో చమురు దిగుమతైంది. ఫిబ్రవరిలో రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుంది. ఇది సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న చమురుకంటే ఎక్కువగా ఉంది. అయితే రష్యా డిస్కౌంట్ తో చమురు అమ్ముతుడడంతో భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది.

Crude Oil: అంతర్జాతీయంగా తగ్గుతున్న చమురు ధరలు..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ దేశాలు ఆంక్షాలు విధించాయి. దీంతో రష్యా భారీ డిస్కాంట్ తో చమురు విక్రయిస్తోంది.కొన్ని నెలలుగా రష్యా నుంచి ఇండియా అధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్ చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. అయితే తగ్గింపుతో భారత్ చమురు దిగుమతి చేసుకున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు.

Crude Oil: అంతర్జాతీయంగా తగ్గుతున్న చమురు ధరలు..

రష్యా ధరలు తగ్గించి ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు తగ్గినా మన దేశంలో మాత్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చమురు ధరలు ఇంకా తగ్గితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

English summary

Crude Oil Prices Are Decreasing from last few days

Oil prices are falling. Oil prices also fell on Friday.

Story first published: Saturday, March 18, 2023, 13:40 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *