News
oi-Lekhaka
By Lekhaka
|
ఇంధనం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు.. గోల్డ్మెన్ సాచ్ నివేదిక షాక్ ఇచ్చింది. రానున్న రోజులు మరింత దారుణంగా ఉండనున్నట్లు హెచ్చరించింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే బారల్కు 30 డాలర్ల మేర క్రూడ్ ఆయిల్ ధరలు ఎగబాకుతాయని అభిప్రాయపడింది.
ఆసియా దేశాలే కీలకం:
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ ‘గోల్డ్మెన్ సాచ్’ అంచనా వేసింది. జీరో కొవిడ్ విధానానికి చైనా స్వస్తి చెప్పి, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో.. ఇంధన వినియోగం పెరగనున్నట్లు అభిప్రాయపడింది. చైనా సహా ఇతర ఆసియా దేశాలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు మొదలుపెడితే.. త్వరలోనే బ్యారల్ బ్రెంట్ ఆయిల్ ధర 110 డాలర్లకు చేరుకుంటుందని భావిస్తోంది. కాగా నిన్న ఫ్యూచర్స్ ట్రేడింగ్ 82 డాలర్లు వద్ద కొనసాగింది.

మరోసారి ఆంక్షల దిశగా…
ఇప్పటికే రష్యా క్రూడ్ ఆయిల్ రేట్లపై ఇప్పటికే ఐరోపా, అమెరికా సహా దాని మిత్ర దేశాలు క్యాప్ విధించాయి. ఫిబ్రవరిలో మరోసారి కఠిన ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ దేశాలు సిద్ధమవుతున్నాయి. గత నెలలో వాటి కంటే ఈసారి మరింత కఠినంగా ఉండబోతున్నాయని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ పేర్కొంది. వెస్ట్రన్ దేశాల ఆంక్షలు, ప్రైస్ క్యాప్ అమల్లో ఉన్నప్పటికీ.. ఇతర దేశాల ఆర్డర్ల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని రష్యా ఉపప్రధాని అలెగ్జాండర్ తెలిపారు.
English summary
Goldman Sachs report on crude oil prices hike
Goldman Sachs report on crude oil prices hike
Story first published: Friday, January 13, 2023, 6:30 [IST]