PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Crypto News: కొత్త బడ్జెట్ కోసం వేచి ఉన్న క్రిప్టో ఇండస్ట్రీ.. వారి కోరికల చిట్టా ఏమిటంటే..!!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Crypto News: క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం తన కఠినత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. కేవలం దేశంలో మాత్రమే కాక.. పలు అంతర్జాతీయ వేధికలపై కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పింది. ప్రజలను వీటికి దూరం చేసేందుకు చాలా రకాల మార్గాలను కేంద్రం అమలు చేస్తోంది. వీటికి ఎలాంటి చట్టబద్ధత లేకపోవటం, అసాంఘిక కార్యక్రమాలు, టెర్రర్ ఫండింగ్ వంటి వాటికి ఈ మార్గం రాచమార్గంగా మారుతోందని భారత ప్రభుత్వం ఆందోళన కూడా వ్యక్తం చేసింది.

గతంలో ఇన్వెస్టర్లను క్రిప్టోలకు దూరం చేసేందుకు వాటిపై వచ్చే ఆదాయం నుంచి ఏకంగా 30 శాతం పన్నును వసూలు చేస్తోంది. పైగా టీడీఎస్ రూల్స్ కూడా తీసుకొచ్చింది. ప్రధానంగా క్రిప్టోలకు ప్రత్యేక ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా క్రిప్టో లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావాలి, అకౌంటబిలిటీని పెంచాలన్నది వారి ప్రధాన ఉద్ధేశంగా తెలుస్తోంది.

Crypto News: కొత్త బడ్జెట్ కోసం వేచి ఉన్న క్రిప్టో ఇండస్ట్రీ

క్రిప్టోలకు ప్రజలను చేసే ప్రయత్నంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ డిజిటల్ రూపీని తీసుకొచ్చింది. ఇది క్రిప్టో కరెన్సీల మాదిరిగానే పనిచేస్తుంది. అయితే దీనిని పూర్తిగా రిజర్వు బ్యాంక్ మద్ధతు ఇస్తుంది. ఇది సావరిన్ కరెన్సీ లక్షణాలను కలిగి ఉన్నందున చెల్లింపులకు నమ్మకమైన వీలు కల్పించే మార్గంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పటికే హోల్ సేల్ వినియోగదారుల చెల్లింపుల సెటిల్ మెంట్ వ్యవస్థలో దీనిని ప్రయోగాత్మకంగా వినియోగానికి తీసుకొచ్చింది. దీని తర్వాత రిటైల్ విభాగంలోనూ పరీక్షించి అవసరమైన మార్పులు చేయాలని యోచిస్తోంది.

క్రిప్టో కరెన్సీల విషయాన్ని గమనిస్తే.. ఇటీవల అమెరికాలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటిగా ఉన్న FTX కొలాప్స్ కావటం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ఎక్స్ఛేంజీలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటం.. వాటి పనితీరు, లావాదేవీలు, భద్రత వంటి అనేక విషయాల్లో ప్రభుత్వాల నియంత్రణ కొరవడటం సాధారణ ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టాల భారిన పడటానికి కారణమని భారత ప్రభుత్వం వాధిస్తోంది. దేశీయ రిటైలర్లను ఇలాంటి వాటికి దూరం చేసేందుకు తగు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ సారి బడ్జెట్లో క్రిప్టోల కట్టడికి ఎలాంటి చర్యలతో నిర్మలమ్మ వస్తుందనేది చాలా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర కఠిన వైకరితో ఇప్పటికే చాలా మంది భారతీయులు ఈ పెట్టుబడులకు దూరంగా జరిగారు.

English summary

Crypro investors and exchanges looking for budget 2023 for announcements

Crypro investors and exchanges looking for budget 2023 for announcements

Story first published: Tuesday, January 10, 2023, 19:15 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *