అలవాటు మారలేదు..

దేశంలో చాలా మంది వాడుకలో ఉన్న వివిధ డినామినేషన్ల కరెన్సీ నోట్లపై ప్రజలు పెన్నుతో రాస్తుంటారు. కొంత మంది ఫోన్ నంబర్లు, పేర్లు, వివరాలు, బొమ్మలు, నంబర్లు, పిచ్చి గీతలు వంటివి ఏవేవో రాస్తుంటారు. అయితే RBI కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇలాంటివి చెల్లుబాటుకావనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ వార్తల ప్రకారం ఇలాంటి నోట్లు చెలామణికి పనికిరావని తెలుస్తోంది.

ఆందోళనపై..

చెలామణిలో ఉన్న ఈ వార్తపై PIB ఇండియా ఫ్యాక్ట్ చెక్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. వార్తలో చెప్పినట్లుగా పెన్నుతో రాసిన కరెన్సీ నోట్లు చెల్లవనటానికి.. RBI వద్ద అలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీఐబీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది ఫేక్ వార్త అని తెలిపింది.

షాపుల్లో తీసుకోకపోతే..

షాపుల్లో తీసుకోకపోతే..

నోట్లపై పెన్నుతో రాసినప్పటికీ అవి చెల్లుబాటు అవుతాయని పీఐబీ వెల్లడించింది. వీటి విషయంలో బ్యాంకులు లేదా ఇతర దుకాణాలు చెల్లవని నిరాకరించటం కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజిటల్ యుగం ప్రారంభంతో చాలా మంది భౌతిక కరెన్సీ వినియోగానికి దూరమయ్యారు. ఎక్కువమంది ఆన్ లైన్ చెల్లింపులకు మళ్లుతున్నారు.

కానీ.. గుర్తుంచుకోండి..

రూపాయి నోట్లపై పెన్నుతో రాయడం వల్ల వాటి ఉపయోగకరమైన జీవితకాలం తగ్గుతుంది. కాబట్టి నోట్లపై పెన్నుతో రాయటాన్ని మానుకోవాలని పీఐబీ సూచించింది. కాబట్టి ఇలాంటి అలవాట్లకు స్వస్తి పలకడం వల్ల రూపాయి నోట్ల జీవితకాలం పెరుగుతుంది. దానివల్ల కరెన్సీ నోట్లను ఎక్కువకాలం వినియోగించవచ్చు.. ప్రభుత్వానికి సైతం వీటి ముద్రణ ఖర్చు తగ్గుతుంది.

ఇది నిజం..

ఇది నిజం..

మరొక నివేదికలో BHIM UPI ఇప్పుడు అధికారిక WhatsApp ఛానెల్‌ని కలిగి ఉందని వార్త ప్రచారంలో ఉంది. సరికొత్త ఫీచర్లు, ఆఫర్లతో యూజర్‌లు అప్‌డేట్‌గా ఉండటానికి ఇది సహాయపడుతుందనే సందేశం కూడా విస్తృతంగా వ్యాపించింది. సేవను పొందడం కొనసాగించడానికి కస్టమర్లు +918291119191కి ‘హాయ్’ అని టెక్స్ట్ చేయవలసిందిగా చెప్పబడింది. పీఐబీ నిర్వహించిన సర్వేలో ఇది నిజమేనని తేలింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *