D Mart: దంచికొట్టిన డీమార్ట్ లాభాలు.. పండుగ పూట ఫుల్ జోష్.. ఇన్వెస్టర్లు హ్యాపీ..

[ad_1]

త్రైమాసిక ఫలితాలు..

త్రైమాసిక ఫలితాలు..

మామూలుగానే దేశంలో డీమార్ట్ స్టోర్లు ప్రజలకు చాలా చేరువ అయ్యాయి. దేశంలోని అతిపెద్ద రిటైల్ స్టోర్ల చైన్ వ్యాపారాన్ని దమానీ DMart బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్నారు. దీని మాతృసంస్థే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ పండుగ సీజన్లో బొనాంజా లాభాలను నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది.

పెరిగిన లాభాలు..

పెరిగిన లాభాలు..

డిసెంబర్ త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ.641 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం కేవలం రూ.586 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పెరిగి రూ.589 కోట్లకు చేరుకుంది. అలాగే ఏకేకృత ఆదాయం దాదాపుగా 25.5 శాతం పెరిగి రూ.11,569 కోట్లకు చేరుకుంది. కంపెనీ స్టాండ్‌లోన్ ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,065 కోట్ల నుంచి 25 శాతం పెరిగి రూ.11,305 కోట్లకు చేరుకుంది.

టాక్సుల తర్వాత..

టాక్సుల తర్వాత..

2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో EBITDA రూ.974 కోట్లకు పెరిగింది. ఇది గడచిన ఏడాది ఇదే కాలంలో రూ.868 కోట్లు కావటం గమనార్హం. క్యూ3లో EBITDA మార్జిన్ 9.6 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. అయితే శుక్రవారం ముగిసిన ట్రేడింగ్ సెషన్లో ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ 1.28 శాతం క్షీణించింది. దీంతో స్టాక్ ధర రూ.3,862.20గా ఉంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *