అరకప్పు కందిపప్పు, అరకప్పు మైసూర్ పప్పు అంటే ఎర్ర కందిపప్పు తీసుకుని బాగా కడగాలి. వీటిని మైక్రోవేవ్ బౌల్‌లో వేయండి. రుచికి తగినట్లుగా ఉప్పు, అర స్పూన్ పసుపు, 2 కప్పుల నీరు వేయండి. ఈ గిన్నెను మైక్రోవేవ్‌లో పెట్టి 20 నిమిషాల టైమ్ సెట్ చేయండి. తర్వాత గిన్నెను బయటికి తీసుకుని గరిటెతో మెత్తగా చేసి అరకప్పు నీరు కలిపండి. పపపు ఇంకా ఉడకలేదనిపిస్తే మిక్సీ పట్టొచ్చు.

పోపు కూడా..

ఇలా మామూలు పప్పు మాత్రమే కాదు. పోపు కూడా వేసుకోవచ్చు. అదెలా అంటే ఓ పెద్ద మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని అందులో నూనె, నెయ్యి ఏదైనా వేసి అందులోనే జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, తరిగిన టమాట వేయండి. ధనియాపొడి, కారం, మసాలా కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసి పోపు పెట్టేయడమే.

Also Read : Diabetes : ఉదయాన్నే ఇలా అనిపిస్తే షుగర్ ఉన్నట్లేనట..

చివరిగా తయారైన పప్పులో ఈ పోపు వేసి కలపండి. మీకు జారుడులా కావాలో అలానే కావాలో చూసి పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెపై మూతపెట్టి మైక్రోవేవ్‌లో పెట్టి 3 నుంచి 4 నిమిషాలు అలానే ఉంచండి.

పప్పు రెడీగా ఉందిగా.. సర్వ్ చేసే ముందు కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయండి. దీన్ని అన్నంతో కలిపి తినొచ్చ్చు. మైక్రోవేవ్‌లో రైస్ కూడా చేయొచ్చు. ఇందుకోసం బియ్యం కడిగి నీరు పోసి 15 నిమిషాలు ఉంచండి. ఇంకేముంది అన్నం రెడీ రెండింటిని ఆస్వాదించడమే.

ఇలా కాస్తా క్రియేటివిటీతో వంట చేయొచ్చు. అదే ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో చేయడం మంచిది. ఎందుకంటే గ్యాస్ మీద చేసిన వంట, దీని చేసే వంటకి కాస్తా తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఓవెన్ ఓపెన్ చేయడం పెట్టడం, అడ్జస్ట్ చేయడం ఇలాంటివన్నీ కాస్తా గమనిస్తూ ఉండాలి. అదే గ్యాస్‌పై అయితే మనకు తెలిసే ఉంటుంది. ఈజీగా అవుతుంది. ఈ రెండు పద్ధతులు మీకు ఏది కన్వీనెంట్ ఉంటుందో చూసి అందులోనూ వంటచేయండి.

Relationship : నేను నా వైఫ్ వాళ్ళ అక్కని కావాలనుకుంటున్నా.. ఏం చేయను..
కేవలం అన్నం, పప్పు మాత్రమే కాదు. పాలు వేడి చేయడం, కాఫీ కలుపుకోవడం ఇలాంటి చిన్న చిన్న వంటలన్నీ కూడా ఏంచక్కా మైక్రోవేవ్‌లో చేసుకోవచ్చు. ఓట్స్ కూడా అందులోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నూడుల్స్, పాస్తా, ఇలాంటివన్నీ అందులోనే చేయొచ్చు. ఇందుకోసం ముందుగా అనే అన్ని పదార్థాలు ఒకసారి అందులో పెట్టి చూడడమే. వాడే గిన్నెలు అన్ని కూడా మేక్రోవేవ్ సేఫ్ కంటెయినర్స్ వాడితే సరిపోతుంది. హ్యాపీగా గ్యాస్ లేకపోయినా ఇందులో చేసి హ్యాపీగా వీటిని ఆస్వాదించొచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *