[ad_1]
News
oi-Mamidi Ayyappa
Dalit Bandhu: ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. సంక్షేమం విషయంలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఎల్లప్పుడూ ఒక్క అడుగు ముందే ఉంది. ప్రస్తుతం జాతీయవాద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి ప్రజలకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని మంచి ప్రజా రంజికమైన పథకాలను అమలు చేస్తోంది.
తెలంగాణ ప్రజలకు ఈ క్రమంలో ప్రభుత్వ దళితబంధు పేరుతో ఒక మంచి స్కీమ్ ప్రవేశపెట్టింది. దీనిని ఆగష్టు 4, 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వం విడదల వారీగా ఈ స్కీమ్ ను ప్రజలకు అందిస్తోంది. దీనికింద తెలంగాణలోని SC కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. 100 శాతం సబ్సిడీ స్కీమ్ అయిన దళితబంధు కింద ప్రభుత్వం సదరు కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. పైగా దీనిలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమచేస్తోంది.
ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం ప్రతి ఏటా ఈ స్కీమ్ కోసం రూ.30-40 వేల కోట్లను దళితబంధు స్కీమ్ కోసం వెచ్చించనున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని దళిత సోదరులందరూ ఈ స్కీమ్ కింద అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అందిస్తున్న ధన సహాయంతో సదరు కుటుంబాలు చిన్న పరిశ్రమలు, రిటైల్, ట్రాన్స్ పోర్ట్, సర్వీస్ రంగాల్లో సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించటం ఈ పథకంలోని ముఖ్య ఉద్ధేశ్యం. మెుత్తం 95 రకాల వ్యాపారాలను ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు దీనిని చేరువ చేయాలని సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.
హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తొలిసారి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. అక్కడ మెుత్తం 21,568 కుటుంబాలను ఎంపిక చేయగా.. వారిలో 18,021 కుటుంబాలకు స్కీమ్ అందించటం జరిగింది. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆ ప్రాంతంలో 95 శాతం విజయవంతం అయినట్లు జిల్లా కలెక్టర్ కర్ణన్ వెల్లడించారు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రసంగం ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన బడ్జెట్ త్వరలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సారి దళితబంధు పథకానికి ప్రభుత్వం ఎంత నిధులు కేటాయిస్తుంది, ఇప్పటి వరకు ఎంత మందికి దీనిని అందించిందనే వివరాలు వెలువడనున్నాయి. దీనిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
English summary
Know details about successful Dalit Bandhu scheme of telangana government
Know details about successful Dalit Bandhu scheme of telangana government..
Story first published: Friday, February 3, 2023, 9:50 [IST]
[ad_2]
Source link