News
oi-Chekkilla Srinivas
భారత్ లో మొబైల్ డేటా స్పీడ్ పెరిగింది. 5జీ వచ్చిన తర్వాత మొబైల్ డేటా వేగం 115 శాతం పెరిగింది. భారత్ లో మొబైల్ డేటా స్పీడ్ ర్యాంకింగ్ స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో తక్కువ వ్యవధిలో 49 స్థానాలు పెరిగి 2023 జనవరిలో 69 వ స్థానానికి చేరుకుంది. రష్యా, అర్జెంటీనా వంటి కొన్ని G20 దేశాల కంటే భారత్ ముందుంది.
జియో, ఎయిర్‌టెల్ లో జనవరి 2023లో జియో 5Gని స్పీడ్ హిమాచల్ ప్రదేశ్‌లో 246.49 Mbps గా ఉంది. కోల్‌కతాలో 506.25 Mbpsగా ఉంది. Airtel 5G డేటా స్పీడ్ కోల్‌కతాలో 78.13 Mbps, ఢిల్లీలో 268.89 Mbpsగా ఉంది. వోడాఫోన్ ఐడియా 2022లో వినియోగదారులను కోల్పోతోంది. 5G సహాయంతో భారత్ మొబైల్ స్పీడ్ పనితీరులో మొత్తంగా మెక్సికో, రష్యా, అర్జెంటీనా కంటే ముందుంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు పాకిస్తాన్ వంటి G20 దేశాల కంటే భారత్ ముందుంది.

భారతదేశం అంతటా మీడియన్ డౌన్‌లోడ్ వేగం 115 శాతం పెరిగింది, సెప్టెంబర్ 2022లో 13.87 Mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్ నుండి 2023 జనవరిలో 29.85 Mbpsకి పెరిగింది. ఫలితంగా, స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో భారతదేశం స్థానం సెప్టెంబర్ 2022లో 118 నుండి 49 స్థానాలు మెరుగుపడి 2023 జనవరిలో 69కి చేరుకుంది. తొమ్మిది టెలికాం సర్కిల్‌లలో ఆంధ్రప్రదేశ్, కోల్‌కతా, నార్త్ ఈస్ట్, హర్యానా, రాజస్థాన్, బీహార్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్ వెస్ట్, మధ్యస్థ 5G డౌన్‌లోడ్ వేగం 100 Mbps కంటే తక్కువగా ఉంది.
English summary
India improved by 49 places to rank 69 in mobile data speed
Mobile data speed has increased in India. Mobile data speed has increased by 115 percent since the advent of 5G. Mobile data speed ranking in India has increased by 49 positions in a short period of time to reach 69th position in January 2023 in Speedtest Global Index.
Story first published: Saturday, March 4, 2023, 13:03 [IST]