Diabetes heart disease: టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్న పురుషులతో పోలిస్తే.. టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్న మహిళల్లో గుండె సమస్యల ముప్పు 12 శాతం ఎక్కువగా ఉంటుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. డయాబెటిస్‌ UK ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ (DUKPC) 2023లో ఈ అధ్యయన ఫలితాలను సమర్పించారు. గ్లోబల్ డయాబెటిస్ కమ్యూనిటీ డయాబెటిస్.co.uk ప్రకారం, డయాబెటిస్‌ లేని వ్యక్తులతో పోలిస్తే టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్న మహిళలలో గుండె సమస్యలు వచ్చే ముప్పు 20 శాతం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్న పురుషులతో పోలిస్తే.. మహిళలలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. వీరిలో గుండెపోటు వచ్చే అవకాశమూ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

టైప్ 2 డయాబెటీస్ ఉన్న పురుషులతో పోలిస్తే, టైప్ 2 డయాబెటిస్ ఉన్న స్త్రీలు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఈ అధ్యయనం కనుగొంది. శరీరంలో మంచి కొవ్వు తగ్గి, చెడు కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. చిన్న వయస్సులో టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, సగటున స్త్రీలు పురుషుల కంటే 24 కిలోల బరువు ఎక్కువగా ఉంటారని మాంచెస్టర్ రాయల్ ఇన్‌ఫర్మరీలోని గౌరవ కన్సల్టెంట్ ఫిజీషియన్ ప్రొఫెసర్ మార్టిన్ రూట్టర్ చెప్పినట్లు నివేదిక పేర్కొంది.

diabetes

టైప్ 2 డయాబెటిస్ ఉన్న స్త్రీలు లిపిడ్-తగ్గించే మందులు, యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లను తక్కువగా సూచిస్తున్నారని అధ్యయనం తెలిపింది. ప్రత్యేకించి వారికి హృదయ సంబంధ వ్యాధులు ఉంటే, ఈ పరిస్థితి ఉంటుందని అధ్యయనం చెప్పింది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మహిళలు గుండె సమస్యలకు చికిత్స పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. చాలా మంది మహిళలకు కార్డియాక్ ప్రక్రియలను కూడా సిఫార్సు చేయరు.

డయాబెటిస్ వల్ల గుండెలో తలెత్తే సమస్యను డయాబెటిస్‌ హార్ట్‌ డిసీజ్‌ అంటారు. దీని వల్ల గుండెలోని కండరాలు గట్టి పడటం లేదా బలహీనపడటం జరుగుతుంది. కొందరిలో గుండెకు రక్తం చేరవేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..

exercise


డయాబెటిస్‌ హార్ట్‌ డిసీజ్‌ ముప్పును తప్పించుకోవడానికి రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
డయాబెటిస్‌తో పాటు, బీపీ, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలు వీలైనంత తగ్గించుకొనే ప్రయత్నించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
పోషకాహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *