PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Disney Layoffs: ఆగని ఉద్యోగుల కోతలు.. ఏరి ఏరి ఉద్యోగులను తొలగించాలని డిస్నీ నిర్ణయం..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Disney Layoffs: ఎంటర్‌టైన్మెంట్ రంగంలో ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా ఉన్న డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న ఏప్రిల్ మాసంలో భారీగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఖర్చుల బడ్జెట్ తగ్గించటంలో భాగంగా రీస్ట్రక్చరింగ్ కు కంపెనీ నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఏప్రిల్ మాసం తొలగింపుల్లో 4,000 మందిని ఇంటికి పంపాలని డిస్నీ నిర్ణయించింది. అయితే ఇది ఏకకాలంలో జరుగుతుందా లేక చిన్నచిన్న ముక్కలుగా జరుగుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఏప్రిల్ 3న కంపెనీ వార్షిక సమావేశం జరుగుతున్న తరుణంలో ఈ వార్తలు వెల్లడయ్యాయి. దీనికి ముందు ఫిబ్రవరిలో 7,000 మందిని తొలగిస్తున్నట్లు సీఈవో బాబ్ ఇగెర్ ప్రకటించారు. తొలగింపుల కోసం తాజాగా ఎంపికలు చేసే బాధ్యతలను కంపెనీ సంబంధిత మేనేజర్లకు అందించింది.

Disney Layoffs: ఆగని ఉద్యోగుల కోతలు.. ఏరి ఏరి ఉద్యోగులను తొల

వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ కింద డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఈఎస్‌పిఎన్, డిస్నీ పార్క్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొడక్ట్స్ అనే మూడు ప్రధాన వ్యాపార విభాగాలు ఉంటాయని సీఈవో బాబ్ వెల్లడించారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు క్రమబద్దీకరించేందుకు కంపెనీ తన వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ చర్యల ద్వారా దాదాపు 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన గతంలో వెల్లడించారు.

Disney Layoffs: ఆగని ఉద్యోగుల కోతలు.. ఏరి ఏరి ఉద్యోగులను తొల

ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం పెద్దల కోసం ఉద్దేశించిన సాధారణ వినోదాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ-వినోద కార్యక్రమాలలో ప్రత్యేకత కలిగిన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన హులుతో ఏమి చేయాలనే దాని కోసం ఎంపికలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి తోడు భారత్ లో సైతం ఇటీవల ఐపీఎల్ హక్కులను కోల్పోవటంతో భారీగానే తన ఓటీటీ కస్టమర్లను కంపెనీ కోల్పోయింది. ప్రపంచ ఆర్థిక మందగమనాల తరుణంలో కంపెనీ వేగంగా ఖర్చులను తగ్గించుకునేందుకు తాజా తొలగింపులతో ముందుకు వచ్చిందని తెలుస్తోంది.

English summary

Entertainment company Disney to layoff 4000 employees as part of cost cutting targets

Entertainment company Disney to layoff 4000 employees as part of cost cutting targets

Story first published: Sunday, March 19, 2023, 17:47 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *