News
oi-Chekkilla Srinivas
Divgi TorqTransfer Systems Ltd ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) శుక్రవారంతో ముగియనుంది. ఈ ఐపీఓ మార్చి 1న ప్రారంభమైంది. ఈ ఐపీవో ఇష్యూ సైజ్ రూ.412.12 కోట్లుగా ఉంది. ఈ సంస్థకు ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నందన్ నీలేకని మద్దతు ఉంది. రెండు రోజుల బిడ్డింగ్ తర్వాత, పబ్లిక్ ఆఫర్ 0.38 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. రెండో రోజు తర్వాత డివిజి టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ IPO సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ ప్రకారం, పబ్లిక్ ఇష్యూ రిటైల్ భాగం 1.56 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అయితే NII, QIB భాగం వరుసగా 0.22 సార్లు, 0.06 సార్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
డివ్గి టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ IPOపై గ్రే మార్కెట్ సెంటిమెంట్‌లు కూడా సానుకూలంగా ఉంది. మార్కెట్ పరిశీలకుల ప్రకారం, ఈ రోజు గ్రే మార్కెట్‌లో Divgi TorqTransfer Systems షేర్లు రూ.70 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. Divgi TorqTransfer Systems IPO గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) శుక్రవారం రూ.70 గా ఉంది. గురువారం GMP రూ.65 ఉంది. ఈ రోజు బలమైన స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ఆశాజనకంగా ఉంది. సెకండరీ మార్కెట్లలో బలహీనంగా ఉన్నప్పటికీ, డివ్గి టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ IPO GMP రూ.60 వద్ద స్థిరంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.

“Divgi TorqTransfer సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశంలోని అతి కొద్దిమంది సరఫరాదారులలో ఒకటని ఆనంద్ రాఠీ తెలిపిది. ఈ కంపెనీ టార్క్ కప్లర్, DCT సొల్యూషన్‌లు, EVల కోసం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తోందని వివరించింది. విస్తృత శ్రేణి ఆటోమోటివ్ వాహనాలు, భౌగోళిక ప్రాంతాలు వ్యూహాత్మకంగా ఉన్న ఉత్పాదక సౌకర్యాలు అధిక ఖచ్చితత్వంతో కూడిన భాగాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కంపెనీ ఉన్నట్లు పేర్కొంది.
note: ఈ కేవవలం మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇచ్చాం. మీరు ఐపీవోలో పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణులను సంప్రదించగలరు. ఈ వార్తను గుడ్ రిటర్న్ తెలుగు ధృవీకరించడం లేదు.
English summary
Today is the last day for Divgi TorqTransfer Systems Ltd IPO
Divgi TorqTransfer Systems Ltd’s initial public offering (IPO) will close on Friday. The IPO started on March 1. The issue size of this IPO is Rs.412.12 crores.
Story first published: Friday, March 3, 2023, 10:41 [IST]