కార్పొరేట్ కల్చర్..

భారతీయ కార్పొరేట్ సంస్కృతిలో వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో పనికి సంబంధించిన ఫోన్ కాల్స్, మెసేజ్ లు, ఈ-మెయిల్స్ స్వీకరించడం అసాధారణం కాదు. నిజానికి వీటి వల్ల ఉద్యోగుల్లో చికాకు పెరుగుతుంటుంది. తప్పని పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదా ఫ్యామిలీతో బయటకు వెళ్లినప్పుడు కూడా ఉద్యోగులు ఇలాంటి వాటికి స్పందించాల్సి ఉంటుంది. అలా సెలవులో ఉన్న ఉద్యోగికి ప్రశాంతత లేకుండా పోతుండటం చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది.

డ్రీమ్ 11 నిర్ణయం..

డ్రీమ్ 11 నిర్ణయం..

గేమింగ్ యాప్ డ్రీమ్ 11 తన ఉద్యోగుల కోసం కొత్త UNPLUG పాలసీని ప్రవేశపెడుతోంది. దీని వల్ల ఎవరైనా ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు లేదా వీకాఫ్లో ఉన్న సమయంలో వారిని కంపెనీలోని ఇతరులు సంప్రదించకూడదు. ఈ-మెయిల్, శ్లాక్ లేదా వాట్సాప్ చాట్‌ ద్వారా సంప్రదించటాన్ని కంపెనీ నిషేధించింది. ఉద్యోగి వ్యక్తిగత సమయంలో ఆఫీసు పనులు లేకుండా చూసేందుకు కంపెనీ కొత్త పాలసీని ప్రవేశపెట్టినట్లు సమాచారం.

రిఫ్రెష్‌మెంట్‌..

రిఫ్రెష్‌మెంట్‌..

కంపెనీ UNPLUG అనే విధానాన్ని రూపొందించటం ద్వారా.. ఉద్యోగులు తమ వ్యక్తిగత సమయాన్ని వారి కుటుంబం, స్నేహితులు, రిఫ్రెష్‌మెంట్‌లతో ఆస్వాదించాలని కోరుకుంటోంది. వెస్ట్రన్ దేశాల్లో కంపెనీలు ఉద్యోగుల సంక్షేమానికి తమ పని వాతావారణాన్ని మెరుగుపరుస్తుంటాయి. అయితే మన దేశంలో ఇలాంటి వాటిని చాలా కంపెనీలు పట్టించుకోవు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు డ్రీమ్ 11 కృషి చేస్తోంది.

రూ.లక్ష జరిమానా..

రూ.లక్ష జరిమానా..

అలాగే UNPLUG విధానం ప్రకారం ఏదైనా ఉద్యోగి.. కంపెనీకి సంబంధించిన ఏదైనా పని వివరాల కోసం సెలవులో ఉన్న ఉద్యోగిని సంప్రదిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పిదానికి పాల్పడే ఉద్యోగి రూ.లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డ్రీమ్ 11 తెలిపింది. ఈ నియమం సీనియర్ మేనేజ్‌మెంట్‌తో సహా అందరికీ వర్తిస్తుందని డ్రీమ్ 11 స్పష్టం చేసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *