PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

e immigration: అంతర్జాతీయ ప్రయాణికులకు ఇ-ఇమ్మిగ్రేషన్


News

oi-Bogadi Adinarayana

|

అంతర్జాతీయ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తున్నట్లు అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

e immigration: అంతర్జాతీయ ప్రయాణికులకు ఇ-ఇమ్మిగ్రేషన్

త్వరలోనే అందుబాటులోకి..
గత నెలలో ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణీకుల రద్దీ భారీగా నమోదైనట్లు సింధియా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణీకుల ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌ ను ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులే మాన్యువల్‌గా చేస్తున్నారన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో కలిసి సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

e immigration: అంతర్జాతీయ ప్రయాణికులకు ఇ-ఇమ్మిగ్రేషన్

డేటా బ్యాంక్ అవసరం:
మన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ సహా ఇతర వివరాలపై ఓ డేటా బ్యాంక్ లేదా రిపోజిటరీని తయారు చేయాల్సిన అవసరం ఉందని విమానయాన శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా పలు విషయాలను పరిగణలోనికి తీసుకుని ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.త్వరలోనే ఈ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary

Center working towards digitalizing immigration procedure

Central government working for e immigration..

Story first published: Friday, January 20, 2023, 6:15 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *