ఎన్నికల పర్యవేక్షణలో జిల్లా పంచాయతీ అధికారి

రాష్ట్రవ్యాప్తంగా 4 విడతల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్ జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ, పరిశీలిస్తుండటమే కాకుండా , ఎప్పటికప్పుడు దిగువ స్థాయి సిబ్బoదికి తగు సూచనలు, ఆదేశాలు ఇస్తూ రాజ్యాంగ బద్దంగా, ఎన్నికలు సజావుగా జరిగేట్లు చూస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన జిల్లా సమాచార కేంద్రంలో అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరుపుతున్నారు.

జిల్లా పంచాయతీ అధికారిగా ఇవే తొలి పంచాయతీ ఎన్నికలు అయినప్పటికీ , సమస్యలపై చాలా చాకచక్యంగా, లౌక్యంతో వ్యవహరిస్తున్న తీరు పలువురిని ఆకట్టుకుంటోంది.

రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు కత్తిమీద సాము లాంటివే. అనేక వర్గాలు, పార్టీలు, నాయకుల నుండి వచ్చే వత్తిళ్ళు తట్టుకుంటూ “నొప్పించక-తానొవ్వక” అనే పద్దతిలో వెళ్తున్న జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్ సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు.