టెస్లా షేర్లే కొంపముంచాయి..

ప్రపంచంలోనే అత్యధికంగా 200 బిలియన్ డాలర్లు (సుమారు 16 లక్షల 27 వేల కోట్లు) విలువైన సంపదను కోల్పోయిన మొదటి వ్యక్తిగా ఎలాన్‌ మస్క్ రికార్డులకెక్కారు. సంపద విలువను మాత్రం ఖచ్చితంగా లెక్కించలేమని గిన్నిస్‌ ప్రపంచ రికార్డు ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడిచారు.

ఆయన కార్ల తయారీ కంపెనీ టెస్లా షేర్ల విలువ 11% పడిపోవడంతో ఒక్కరోజులోనే 15 బిలియన్ డార్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది. 2000లో 58.6 బిలయన్‌ డాలర్లు (4 లక్షల 71 వేల 334 కోట్లు) కోల్పోయిన జపాన్‌ పెట్టుబడిదారు మసయోషి సన్‌ పేరిట ఇప్పటి వరకు ఈ రికార్డ్‌ ఉండగా.. మస్క్‌ గతేడాది ఆయనను అధిగమించారు.

ట్విట్టర్‌ కొనుగోలు పెద్ద దెబ్బే..

ట్విట్టర్‌ కొనుగోలు పెద్ద దెబ్బే..

ట్విట్టర్‌ను సుమారు 3.5 లక్షల కోట్లకు కొనుగోలు చేసే సమయంలో 569 కోట్ల విలువైన టెస్లా స్టాక్‌ను మస్క్ విక్రయించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. గత రెండు నెలల్లోనే దాదాపు మరో 600 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. గతేడాదిలో టెస్లా షేర్ల విలువ 60 శాతానికి పైగా పడిపోయిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

పరాభవాల పర్వం:

పరాభవాల పర్వం:

నవంబర్ 2021 నుంచి చూస్తే దాదాపు 182 బిలియన్ డాలర్లు (14 లక్షల 79 వేల కోట్లు) ఎలాన్‌ మస్క్ కోల్పోయినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారమైతే ఈ లెక్క సుమారు 200 బిలియన్ డాలర్లకు (16 లక్షల 25 వేల కోట్లు) పైమాటే. ఇంత భారీ నష్టాలు వెంటాడుతున్నా, ఇప్పటికీ ఆయన రెండవ అత్యంత సంపన్నుడు కావడం విశేషం.

ఇవన్నీ మస్క్ సొంతం:

ఇవన్నీ మస్క్ సొంతం:

ఇన్ని నష్టాలను మూటగట్టుకున్నా.. ఇప్పటికీ మస్క్ చేతిలో అత్యంత ఖరీదైన సంస్థలు ఉన్నాయి. ట్విట్టర్, స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీలతో సహా సోలార్‌సిటీ సైతం ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవికాక 70 వేల డాలర్ల విలువైన ఆడీ క్యూ7, లక్షా 4 వేల డాలర్ల విలువచేసే 1967 సిరీస్‌ జాగ్వార్ కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. టెస్లా డైమండ్, 37 వేల డాలర్ల రూబీ రింగ్‌లు వీటికి అదనం. కొన్ని ప్రైవేట్‌ పడవలు, జెట్‌లు సైతం మస్క్‌ సొంతం చేసుకున్నారు. లాస్‌ ఏంజల్స్‌లో అత్యంత విలాసవంతమైన ఇంటిలో ప్రస్తుతం నివసిస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *