News

oi-Chekkilla Srinivas

|

కొద్ది రోజుల్లో ప్రస్తుతం ఆర్థిక సంవత్సం ముగియనుంది. త్వరలో కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. అయినా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, EPFO ​​బోర్డు పీఎఫ్ వై వార్షిక వడ్డీ రేటును నిర్ణయించుకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. 2021-22 సంవత్సరానికి,8.1 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది. అయితే ఇప్పటికీ ఖాతాదారుల ఖాతాలో వడ్డీని జమ చేయకపోవడం గమనార్హం.

దీనిపై ఉద్యోలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది తమ ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌పై వడ్డీ మొత్తం రాకపోవడంపై ఒకరు కాదు లక్షల సంఖ్యలో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈపీఎఫ్ కు భారీగా ఫిర్యాదులు రావడంతో ఆ సంస్థ స్పందించింది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మీకు అకౌంట్లో వడ్డీ జమ అయిం

ప్రియమైన సభ్యులరా వడ్డీ చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని త్వరలో మీ ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అవుతాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఓ వ్యక్తి యూజర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఏ లాభమని రాసుకొచ్చారు. తమకు పీఎఫ్ వడ్డీ రావడం లేదని వాపోయారు.
గత ఏడాది కూడా ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రాకపోవడం కూడా ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఏ సబ్‌స్క్రైబర్‌కు వడ్డీ నష్టం జరగదని ట్వీట్ చేసింది. వడ్డీ మొత్తం EPF ఖాతాదారులందరి ఖాతాకు బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. పన్ను విధానంలో మార్పు కారణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఆలస్యమవుతుందని వివరించింది.

English summary

Complaints are pouring in social media about non-deposit of interest in PF account

The current financial year will end in a few days. New financial year is coming soon. However, the employees are angry that the Union Ministry of Labor and the EPFO Board have not decided the annual interest rate of PF.

Story first published: Saturday, March 4, 2023, 11:35 [IST]





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *