PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

EPFO News: ఆ గడువు 60 రోజులు పెంచిన ఈపీఎఫ్ఓ.. సదవకాశాన్ని అస్సలు మిస్ కాకండి..!


News

oi-Mamidi Ayyappa

|

EPFO News: సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు తమ యాజమాన్యాలతో కలిగి అదిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని దరఖాస్తుకు గడువు ముగుస్తున్న తరుణంలో తాజాగా దానిని మరో 60 రోజుల పాటు పెంచింది.

గతంలో దరఖాస్తు చేసుకునేందుకు గడువు మార్చి 3, 2023 చివరి తేదీగా ప్రకటించటం జరిగింది. కానీ తాజాగా గడువును పెంచటంతో దీనిని పొందాలనుకునే వారికి దరఖాస్తు గడువు మే 3, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి ముందు సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది.

EPFO News: ఆ గడువు 60 రోజులు పెంచిన ఈపీఎఫ్ఓ.. సదవకాశాన్ని అస

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ కోసం చందాదారులు, వారి యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గతవారం EPFO ​​ఒక విధానాన్ని విడుదల చేసింది. ఆగస్టు 22, 2014 నాటి EPS సవరణ ద్వారా నెలకు రూ.6,500 నుంచి నెలకు రూ.15,000 వరకు పెన్షన్ జీతం పరిమితిని పెంచారు. సభ్యులతో పాటు వారి యజమానులను కోర్టు అనుమతించింది.

English summary

EPFO extended last day for applying to high pension by 60 days for eligible employees

EPFO extended last day for applying to high pension by 60 days for eligible employees

Story first published: Monday, February 27, 2023, 12:13 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *