News
lekhaka-Bhusarapu Pavani
EV:
ఎలక్ట్రిక్
వెహికల్
(EV)
రంగంలోకి
అశోక్
లేలాండ్
అడుగుపెట్టడానికి
సర్వం
సిద్ధమైనట్లే
కనిపిస్తోంది.
వచ్చే
ఏడాది
ప్రారంభంలో
ఎలక్ట్రిక్
లైట్
కమర్షియల్
వెహికల్స్(LCV)ను
విడుదల
చేయడానికి
కంపెనీ
రెడీగా
ఉందని
సంస్థ
MD
&
CEO
షేను
అగర్వాల్
ప్రకటించారు.
బ్యాటరీ
శ్వాపింగ్
ను
సమగ్రపరిచే
పనిలో
ఉందని
వెల్లడించారు.
అశోక్
లేలాండ్
ఎలక్ట్రిక్
ప్యాసింజర్
బస్సులు
మరియు
LCVల
డిమాండ్
ను
ఒడిసి
పట్టుకునేందుకు
ప్రయత్నిస్తోంది.
ఈ
విభాగంలో
వాణిజ్య
వాహనాలకు
సుదీర్ఘ
గ్రోత్
అవకాశం
ఉన్నట్లు
వెల్లడించారు.
మరో
రెండేళ్లలో
మార్కెట్
లో
బలమైన
డిమాండ్
ఏర్పడుతుందని
ధీమా
వ్యక్తం
చేశారు.
కేవలం
EV
వైపు
మాత్రమే
కాకుండా
హైడ్రోజన్
ఆధారిత
వాహనాలూ
భవిష్యత్తులో
ఈ
సెగ్మెంట్
ను
ఏలే
అవకాశం
ఉందని
భావిస్తున్నట్లు
చెప్పారు.

హైడ్రోజన్
బేస్డ్
వాహనాలకు
సంబంధించి
చర్చల్లో
ఉన్న
రెండు
సాంకేతికతలు
ICE
ఇంజిన్స్,
ఇంధన
సెల్
టెక్నాలజీ
దిశగానూ
పనిచేస్తున్నట్లు
అగర్వాల్
ప్రకటించారు.
రిలయన్స్,
అదానీ
వంటి
దిగ్గజ
సంస్థలతో
పాటు
పలువురు
కస్టమర్లతో
ఇందుకోసం
భాగస్వామ్యం
కలిగి
ఉన్నట్లు
చెప్పారు.
ప్రత్యామ్నాయ
ఇంధనాల
వ్యవహారంలో
ఈ
రెండింటిపై
పనిచేయడం
ముఖ్యమని
అభిప్రాయపడ్డారు.
“ప్రజారవాణా
విభాగానికి
చెందిన
బస్సుల్లో
ప్రస్తుతం
ఎలక్ట్రిఫికేషన్
వేగంగా
జరుగుతుంది.
పలు
రాష్ట్రాల
రవాణా
సంస్థలు
విద్యుత్
ఆధారిత
బస్సుల
వైపు
మొగ్గు
చూపుతున్నాయి.
ఎలక్ట్రిక్
శ్రేణి
LCVని
మర్కెట్
లో
విడుదల
చేయడానికి
అశోల్
లేలాండ్
సిద్ధమవుతోంది.
మీడియం,
హెవీ
డ్యూటీ
ట్రక్కుల
విషయానికి
వస్తే..
ఇంకొన్ని
సంవత్సరాలు
వేచి
చూడాల్సి
ఉందని
భావిస్తున్నాను”
అని
అశోక్
లేలాండ్
MD
తెలిపారు.
English summary
Ashok Leyland to launch electric LCV next year
Ashok Leyland to launch electric LCV next year
Story first published: Saturday, May 20, 2023, 7:08 [IST]