PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

exports: వస్తు,సేవల ఎగుమతుల్లో భారత్ ఆల్ టైం రికార్డు.. చైనాతో వాణిజ్య లోటులో..?


ఎగుమతుల ఆల్ టైం గరిష్ఠం

2021-22లో వస్తు, సేవల ఎగుమతులు వరుసగా 422, 254 బిలియన్ డాలర్లుగా నమోదు అయినట్లు, ఆల్ టైం గరిష్టాన్ని తాకినట్లు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తద్వారా ఈ విభాగంలో ఎగుమతుల విలువ 676 బిలియన్ డాలర్లకు చేరినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటికే ఆ మొత్తాన్ని సాధించగా.. ఆర్థిక అనిశ్చితితో సంబంధం లేకుండా 750 బిలియన్ డాలర్ల వృద్ధి సాధించాలని భావిస్తున్నట్లు రైసినా డైలాగులో వెల్లడించారు.

2 ట్రిలియన్ల లక్ష్యం

2 ట్రిలియన్ల లక్ష్యం

అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో గత రెండు నెలల్లో 6.6 శాతం అంటే 32.91 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు క్షీణించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య 8.5 శాతం వృద్ధి చెందినట్లు తెలిపారు. తద్వారా 369.25 బిలియన్ డాలర్లతో వస్తువులు, 272 బిలియన్ డాలర్లతో సేవలు మంచి వృద్ధిని కనపరచాయన్నారు.

తయారీ రంగం, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక శ్రమతో కూడుకున్న నాణ్యమైన ఉత్పత్తులు వెరసి.. దేశీయ ఎగుమతులను ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నారు. 2030 నాటికి ఎగుమతులు 2 ట్రిలియన్ డాలర్లను తాకుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాలదే పూర్తి బాధ్యత

గత ప్రభుత్వాలదే పూర్తి బాధ్యత

చైనా తో ఉన్న వాణిజ్య లోటు గురించి మాట్లాడుతూ.. దేశీయ తయారీ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గోయల్ చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీ ద్వారా దిగుమతులను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

2004 నాటికి భారత్-చైనాల మధ్య వాణిజ్యం 4 బిలియన్ డాలర్లు కాగా.. లోటు 1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు. అదే 2014 నాటిక చూస్తే ఇది 35 రేట్లు పెరిగినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాలు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు.

చైనాతో వాణిజ్యలోటు లెక్కలివీ..

చైనాతో వాణిజ్యలోటు లెక్కలివీ..

దేశంలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గత ఏప్రిల్-డిసెంబర్ మధ్య భారత్ నుంచి చైనాకు చేరిన ఎగుమతులు 11 బిలియన్ డాలర్లు కాగా.. దిగుమతులు దాదాపు 76 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు.

తద్వారా 65 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడినట్లు ప్రకటించారు. అయితే మనం ఆ దేశం నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్న సెమీ కండక్టర్ల గురించి ఇప్పటికే ప్రభుత్వం ఓ పెద్ద ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు.

గుజరాత్ లో నెలకొల్పనున్న దీనితోపాటు మరికొన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలపై UK, కెనడాలతో పాటు మరిన్ని దేశాలతో సంప్రదింపులు వేగవంతంగా జరుగుతున్నట్లు వివరించారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *