కొత్త వడ్డీ రేట్లు..
7 రోజుల నుంచి 10 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ ఖాతాదారులకు 3.25% నుంచి 7.15% వరకు వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో రివిజన్ తర్వాత సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7.65% వరకు వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.

400 రోజుల స్కీమ్..
కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్ స్కీమ్ కింద 7.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ ఆదాయాన్ని పొందుతారని బ్యాంక్ వెల్లడించింది. రూ.15 లక్షల కంటే ఎక్కువ కాల్ చేయని డిపాజిట్ కోసం బ్యాంక్ సాధారణ పౌరులకు 400 రోజుల వ్యవధిలో 7.45 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75% అత్యధిక వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.

సీనియర్ సిటిజన్లు..
2023లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సాధారణ డిపాజిటర్ల కంటే 0.50 శాతం ఎక్కువగానే ఆఫర్ చేస్తోంది. 180 రోజుల కంటే ఎక్కువ కాలానికి చేసే డిపాజిట్లు లేదా రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లకు ఈ అదనపు వడ్డీ రేటు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఓవర్ డ్యూ డిపాజిట్స్..
ఒకవేళ ఎవరైనా ఖాతాదారుడు చేసిన టర్మ్ డిపాజిట్ మెచూర్ అయినప్పుడు దానిని వారు విత్ డ్రా చేసుకోవకపోతే దానిపై బ్యాంక్ తక్కువ వడ్డీని చెల్లిస్తుంది. ఇలాంటి క్లెయిమ్ చేయని డిపాజిట్లపై బ్యాంక్ సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు చెల్లించే తక్కువ వడ్డీని అందిస్తుంది. అందుకే ఖాతాదారులు సకాలంలో డిపాజిట్లను రెన్యూవల్ చేయటం లేదా వాటిని విత్ డ్రా చేయటం ఉత్తమమైనది.