Flipkart: డబ్బేడబ్బు.. ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 25,000 మందికి ప్రయోజనం

[ad_1]

స్టార్టప్ చరిత్రలో..

స్టార్టప్ చరిత్రలో..

ఫ్లిప్‌కార్ట్ తాజాగా తీసుకున్న నిర్ణయం భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అతిపెద్ద వెల్త్ రియాక్షన్ ఇన్‌స్టాన్స్‌లలో ఒకటిగా మారుతుందని ప్రముఖ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. కంపెనీ మాతృసంస్థ వాల్‌మార్ట్‌ తో సహా ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు నగదు చెల్లింపు కోసం నిధులను సమకూరుస్తారని తెలుస్తోంది.

ఎవరెవరికి ప్రయోజనం..

ఎవరెవరికి ప్రయోజనం..

కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫోన్ పే కింద పనిచేసిన ప్రస్తుత, గత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నగదు చెల్లింపు సాధారణ ఈక్విటీ లేదా ESOP(ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ప్లాన్‌లు) బైబ్యాక్‌కి భిన్నంగా ఉంటుంది. ఫోన్‌పేని వేరు చేయడానికి కంపెనీ చేసే చర్యలో భాగంగా వారు ఎలాంటి ఎంపికలను విక్రయించడం లేదు కానీ డబ్బును పొందుతున్నారు. కంపెనీ డిసెంబర్ 23న చెల్లింపును ప్రకటించింది.

ఉద్యోగులకు మెయిల్..

ఉద్యోగులకు మెయిల్..

ఈ చెల్లింపుకు సంబంధించిన వివరాలను ఫ్లిప్ కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి ఉద్యోగులకు అంతర్గత మెయిల్‌ ద్వారా ఇప్పటికే వెల్లడించారు. Flipkart షేర్ ధర PhonePe మినహా 165.83 డాలర్ల వద్ద నిర్ణయించబడింది. అయితే చెల్లింపు ఎంపికకు 43.67 డాలర్లుగా ఉంటుంది. కొనుగోలు చేసినప్పటి నుంచి కంపెనీ వాల్యుయేషన్ దాదాపు రెండింతలు పెరగటాన్ని ఇది సూచిస్తుంది.

విడిపోయిన ఫోన్ పే..

విడిపోయిన ఫోన్ పే..

పూర్తిగా భారతీయ కంపెనీగా మారాలనే లక్ష్యంలో భాగంగా ఫోన్ పే.. ఫ్లిప్ కార్ట్ నుంచి విడిపోయింది. ఈ విషయాన్ని వారం ప్రారంభంలో కంపెనీ వెల్లడించింది. 2015లో ఈ కామర్స్ దిగ్గజం చెల్లింపుల దిగ్గజంగా ఎదుగుతున్న ఫోన్ పే ఫిన్ టెక్ స్టార్టప్ ను కొనుగోలు చేసింది. PhonePe ఇటీవల తన రిజిస్టర్డ్ కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారతదేశానికి తరలించింది. త్వరలోనే IPOగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రావాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇది పేటీఎం కంటే భిన్నంగా ఉంటుందా లేక దానిలాగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత నష్టపోతుందా అనేది వేచి చూడాల్సిందే.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *