[ad_1]
ఉల్లిపాయ
కిడ్నీ సమస్య ఉన్నవారు సోడియం తక్కువగా ఉండే ఉల్లిపాయను వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారి వంటల్లో ఉప్పు స్కిప్ చేసి, దానికి బదులుగా ఉల్లిపాయలు వాడితే మంచిది. కిడ్ని పేషెంట్స్ ఉప్పుకు దూరంగా ఉంటేనే మంచిది. ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వెల్లుల్లి..
కిడ్నీ రోగులు వంటల్లో ఉప్పుకు బదులుగా వెల్లుల్లిని ఉపయోగిస్తే మంచిది. వెల్లుల్లి ఆహారం టేస్ట్‌ను పెంచడమే కాదు.. మీ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వెల్లుల్లిలో సోడియం, పోటాషియం, పాస్పరస్ మోతాదు తక్కువగా ఉంటుంది, దీని వల్ల కిడ్నీ పెషేంట్లకు వెల్లుల్లి చాలా వరకు మేలు చేస్తుంది. వెల్లుల్లి రక్తాన్ని శుద్ది చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా వెల్లులి తోడ్పడుతుంది. దీన్ని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని తిన్నా మంచిది. వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి మరియు విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కాలీఫ్లవర్
కిడ్నీ పేషెంట్స్‌కు కాలీఫ్లవర్ సూపర్ ఫుడ్‌లా పని చేస్తుంది. ఫ్యాట్ ఇన్‌ఫ్లమేషన్, ఆక్సీకరణ తగ్గించి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో సోడియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటే.. కిడ్నీలలో ఎక్కువగా నీరు చేరి వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది. కాలీఫ్లవర్‌లో సోడియం, పొటాషియం తక్కువగా ఉంటుంది, ఇది మీ శరీరంలో నీటి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్‌లో తక్కువ ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ క్లీన్ చేసి కిడ్నీలపై భారం పడకుండా చేస్తుంది. విటమిన్ సి, ఫోలేట్‌లు పష్కలంగా ఉంటాయి.. ఇవి మీ శరీరం టాక్సిన్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీస్‌లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీస్‌లో ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేందుకు సహాయపడతాయి.
ఓట్స్..
ఓట్స్‌లో కూడా పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో ‘బీటా గ్లూకాన్’ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.
రెడ్ క్యాప్సికమ్
రెడ్ క్యాప్సికమ్ కిడ్నీ పేషెంట్‌కు సూపర్ ఫుడ్‌లా పని చేస్తుంది. రెడ్ క్యాప్సికమ్‌లో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బీ 6 ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి కిడ్నీ పని తీరును మెరుగుపరుస్తాయి.
యాపిల్..
యాపిర్ ప్రతిరోజూ తింటే.. ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతారు. యాపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. యాపిల్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి, డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండటానికి ఇవి ఉపకరిస్తాయి. డయాబెటిస్ వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ. కాబట్టి ఆపిల్ తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆపిల్స్‌లో పొటాషియం, ఫాస్పరస్, సోడియం తక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీ పేషెంట్స్‌కు మంచి ఆప్షన్. కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఆపిల్ తినాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- ఫ్యాట్స్, చక్కెర, మాంసం తక్కువగా తీసుకోండి. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు తీసుకోవచ్చు. కూల్‌డ్రింక్స్, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి. నీరు ఎక్కువగా తీసుకోండి.
- స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. స్మోకింగ్ కారణంగా కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది.
- పెయిన్ కిల్లర్స్ వీలైనంతవరకు తక్కువగా తీసుకోండి. వీటిని డాక్టర్ సలహా లేకుండా తీసుకోవద్దు. కొన్నిరకాల క్యాన్సర్ మందులు, యాంటీబయోటిక్ మందులు కూడా కిడ్నీలను దెబ్బతీయొచ్చు. వీటి విషయంలో జాగ్రత్త అవసరం.
- రోజుకు 7-8 గంటల సేపు నిద్ర పోవటమూ ముఖ్యమే. తగినంత నిద్ర లేకపోతే డయాబెటిస్, హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఉండవు. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
- ఒత్తిడితో కారణంగానూ కీడ్నీల సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటితో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం మంచిది.
[ad_2]
Source link